మంచు మనోజ్ సంచలన ట్వీట్.. ఒంటరిగా వస్తానంటూ అన్నకు సవాల్ !

ట్విట్టర్ వేదికగా మంచు మోహన్ బాబు కుమారులు విష్ణు, మనోజ్ ఒకరిపై ఒకరు విరుచుకుపడుతున్నారు. ఇద్దరు వరుసగా ట్వీట్లు చేస్తూ మంచు ఫ్యామిలీ గొడవను సామాజిక మాధ్యమాల వరకు తీసుకువచ్చారు. తాజాగా మంచు మనోజ్ ట్విట్టర్లో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం ఆసక్తిగా మారింది. 'కలిసి కూర్చొని మాట్లాడుకుందాం. నాన్న, ఇంట్లోను మహిళలు, ఉద్యోగులు, మిగిలిన వాళ్లను పక్కనపెట్టి మనమే చర్చించుకుందాం. ఏం అంటావు.' అంటూ మనోజ్ ట్విట్టర్లో రాసుకువచ్చారు.

Manchu Manoj, Manchu Vishnu

మంచు మనోజ్, మంచు విష్ణు

మంచు మోహన్ బాబు ఫ్యామిలీ లో నెలకొన్న వివాదం ఇప్పట్లో సద్దుమనిగేలా కనిపించడం లేదు. గడిచిన కొద్ది వారాల నుంచి ఈ కుటుంబంలో గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. మంచు మనోజ్ పై దాడి జరగడంతోపాటు ఆయన ఆసుపత్రిలో కూడా చేరారు. ఆ తర్వాత మంచు మోహన్ బాబు కూడా అనారోగ్య సమస్యతో ఆసుపత్రిలో చేరి వైద్యం పొందారు. ఈ కుటుంబంలో నెలకొన్న గొడవలతో పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కారు. ఆస్తి వివాదాల నేపథ్యంలోనే గొడవలు జరుగుతున్నట్లు చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ట్విట్టర్ వేదికగా మంచు మోహన్ బాబు కుమారులు విష్ణు, మనోజ్ ఒకరిపై ఒకరు విరుచుకుపడుతున్నారు. ఇద్దరు వరుసగా ట్వీట్లు చేస్తూ మంచు ఫ్యామిలీ గొడవను సామాజిక మాధ్యమాల వరకు తీసుకువచ్చారు. తాజాగా మంచు మనోజ్ ట్విట్టర్లో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం ఆసక్తిగా మారింది. 'కలిసి కూర్చొని మాట్లాడుకుందాం. నాన్న, ఇంట్లోను మహిళలు, ఉద్యోగులు, మిగిలిన వాళ్లను పక్కనపెట్టి మనమే చర్చించుకుందాం. ఏం అంటావు.' అంటూ మనోజ్ ట్విట్టర్లో రాసుకువచ్చారు. తాను ఒంటరిగానే వస్తానని మాట ఇస్తున్న అంటూ పేర్కొన్న మనోజ్.. నీకు నచ్చిన వాళ్ళని నువ్వు తీసుకురావచ్చు లేదా మనం ఆరోగ్యకరమైన డిబేట్ పెట్టుకుందామంటూ పోస్ట్ చేశారు. అదే తాను ఎవరైనా ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టారు అనేది మాత్రం మనోజ్ నేరుగా చెప్పలేదు. మంచి కుటుంబంలో వివాదాల నేపథ్యంలో ఈ ట్వీట్ తన సోదరుడు విష్ణును ఉద్దేశించి పెట్టండిగా ప్రస్తుతం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతోంది. ఈ ట్వీట్ కు మంచు విష్ణు గాని, ఇతర కుటుంబ సభ్యులు గానీ ఎలా స్పందిస్తారు అన్నది చూడాల్సి ఉంది. 

కొద్దిరోజులుగా మంచు మోహన్ బాబు కుటుంబంలో వివాదాలు హాట్ టాపిక్ గా మారాయి.  ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకోవడంతో ఈ వ్యవహారం పెద్ద ఎత్తున చర్చుకో దారి తీసింది. ఒక మీడియా ఛానల్ రిపోర్టర్ పై మోహన్ బాబు ఈ గొడవ సందర్భంగా దాడికి పాల్పడ్డారు. హత్యాయత్నం కింద కేసు కూడా ఆయనపై నమోదయింది. అయితే అంతా బాగుందనుకుంటున్న తరుణంలో సంక్రాంతి వేల మరోసారి వివాదం మొదలైంది. పండగ వేళ మంచు మనోజ్, మౌనిక దంపతులు తిరుపతి రంగంపేటలోని మోహన్ బాబు యూనివర్సిటీకి వెళ్లడంతో గొడవ మళ్ళీ మొదలైంది. ఈ వ్యవహారం కూడా కేసులు వరకు వెళ్ళింది. ఈ గొడవలు నేపథ్యంలో మంచి బ్రదర్స్ ట్వీట్స్ మరోసారి వైరల్ గా మారాయి. రెండు రోజుల కిందట మంచు విష్ణు కూడా ఒక ట్వీట్ చేశారు. రౌడీ సినిమాలోని ఒక డైలాగ్ ఆడియోను యాక్షలో పోస్ట్ చేశారు మంచు విష్ణు. తన ఫేవరెట్ డైలాగ్స్ లో ఇది ఒకటి అంటూ దానికి ట్యాగ్ చేశారు. ' సింహం అవ్వాలని ప్రతి కుక్కకు ఉంటుంది. కానీ వీధిలో మొరగటానికి.. అడవిలో గర్జించడానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలోనైనా తెలుసుకుంటావన్న ఆశ' అనే డైలాగులు మంచు విష్ణు పోస్ట్ చేశారు. విష్ణు పోస్ట్ పెట్టిన గంటల్లోనే దానికి కౌంటర్ అన్నట్టుగా ఎక్స్ లో పోస్ట్ పెట్టారు మనోజ్. కృష్ణంరాజు నటించిన తాండ్రపాపారాయుడు, భక్తకన్నప్ప, బొబ్బిలి బ్రహ్మన్న పోస్టర్లను షేర్ చేస్తూ మనోజ్ చేశారు. 'భక్త కన్నప్పలో కృష్ణంరాజు లాగా సింహం అవ్వాలని ప్రతి కుక్కకీ ఉంటుంది.. ఈ విషయం నువ్వు ఇదే జన్మలో తెలుసుకుంటావ్ ' అని మంచు మనోజ్ పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే మనోజ్ మరో ట్విట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనిపై విష్ణు ఎలా స్పందిస్తారన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా తాజా పరిణామాలను చూస్తుంటే మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో నెలకొన్న వివాదాలు ఇప్పట్లో సద్దుమనిగేలా కనిపించడం లేదు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్