భూమి కబ్జా.. ఎవరైనా మీ భూమిని ఆక్రమిస్తే, లేదా హక్కు లేకుండానే ఆక్రమించుకోవాలని ప్లాన్ చేస్తే దాన్ని భూ కబ్జా (Lang Grabbing) అంటారు. బలవంతంగా, బెదిరింపులకు పాల్పడి భూమిని ఆక్రమించుకొనే పరిస్థితినే భూ కబ్జా అంటారు.
భూమి కబ్జా.. ఎవరైనా మీ భూమిని ఆక్రమిస్తే, లేదా హక్కు లేకుండానే ఆక్రమించుకోవాలని ప్లాన్ చేస్తే దాన్ని భూ కబ్జా (Lang Grabbing) అంటారు. బలవంతంగా, బెదిరింపులకు పాల్పడి భూమిని ఆక్రమించుకొనే పరిస్థితినే భూ కబ్జా అంటారు. భూ కబ్జాకోరుల నుంచి అసలైన యజమానులకు చట్టం రక్షణ కల్పిస్తుంది. ఎవరైనా మీ భూమిని ఆక్రమించినట్లైతే.. ముఖ్యంగా మూడు రకాల రికార్డులు ఉండాలి. 1. వ్యక్తిగత రికార్డులు (భూ పట్టా సంబంధిత రికార్డులు), 2. ప్రభుత్వ రికార్డులు, 3. సదరు భూమికి సంబంధించిన ఇతర ఆధారాలు. అంటే.. ఆస్తి పన్నులు, హక్కుల రికార్డు (ఆర్ఓఆర్), మ్యుటేషన్ రిజిస్టర్ వంటి సహాయక పత్రాలు ఉండాలి. ఈ డాక్యుమెంట్లతో కోర్టుకు వెళితే మీకు వీలైనంత త్వరగా న్యాయం జరుగుతుంది. వ్యక్తిగత రికార్డులతో ప్రభుత్వ రికార్డులు సరిపోలితే వెంటనే ఆ భూమి మీ సొంతం అవుతుంది.
సాధారణంగా భూ కబ్జా కేసుల్లో పోలీసులు కేసు నమోదు చేయరు. సివిల్ సంబంధిత వ్యవహారం అని చెప్తుంటారు. అలాంటప్పుడు భూమి కబ్జా చేసిన వ్యక్తి మీ ప్రాపర్టీని డ్యామేజ్ చేస్తే.. వెంటనే పోలీసులను ఆశ్రయించి క్రిమినల్ కేసు నమోదు చేయించవచ్చు. కోర్టుకు వెళ్లి భూమి సంబంధ ఆధారాలు సమర్పించి భూమిని తిరిగి తెచ్చుకోవచ్చు.
సత్వర న్యాయానికి ఇంజంక్షన్ ఆర్డర్లు
భూమి విషయంలో ఇబ్బంది ఎదురైతే లాయర్ ద్వారా కోర్టులో కేసు నమోదు చేయాలి. ఆధారాలు సమర్పిస్తే, సత్వర న్యాయం కింద ఇంజంక్షన్ ఆర్డర్ ప్రకారం కేసు వేస్తే ఊరట లభిస్తుంది. ఇలా ఎవరైనా భూముల విషయంలో ఇబ్బందులు ఎదురుకుంటే న్యాయవాది ద్వారా కానీ లేక మన దగ్గర ఉండే ఆధారాలతో కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చు. సత్వర న్యాయం కింద ఇంజంక్షన్ ఆర్డర్ ప్రకారం కేసు వేసిన వారికి ఊరట లభిస్తుంది. భూయజమానిగా సెక్షన్ 39, రూల్స్ 1, 2 ప్రకారం కేసు నమోదు చేయాలి. భూ కబ్జా చేసినట్టు ఆధారాలు సమర్పించాలి.
భూ కబ్జా సంబంధిత కేసుల్లో భారతీయ శిక్ష్మాస్మృతి వివిధ సెక్షన్లు ఇలా..
1. సెక్షన్ 441: ఒక వ్యక్తి చట్టవ్యతిరేకంగా భూ కబ్జా చేసినా, గడవు పూర్తయ్యి ఆ భూమిని ఖాళీ చేయకపోయినా, యజమానిని అవమానించటం, భయపెట్టడం లాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా ఈ సెక్షన్ ప్రకారం చర్యలు తప్పవు.
2. సెక్షన్ 425: ఉద్దేశపూర్వకంగా ఆస్తికి నష్టం కలిగిస్తే ఈ సెక్షన్ వర్తిస్తుంది.
3. సెక్షన్ 420: అనుమానిత భూమిని వేరొకరికి ట్రాన్స్‌ఫర్ చేయటానికి ప్రయత్నిస్తే ఈ సెక్షన్ కింద చర్యలు తీసుకోవచ్చు.
4. సెక్షన్ 422, సెక్షన్ 503 కూడా భూ కబ్జా నుంచి కాపాడుతాయి.
శిక్ష ఇలా.. భూ కబ్జా చేసినట్టు నేరం రుజువైతే నేరస్థులకు కోర్టు జరిమానా విధిస్తుంది. మూడు నెలల వరకు జైలు శిక్ష వేస్తుంది.