Law Tip | క్వాష్ పిటిషన్ అంటే.. ఎందుకు దాఖలు చేస్తారంటే..

క్వాష్ పిటిషన్ - QUASH PETITION. అసలు క్వాష్ పిటిషన్ అంటే ఏమిటి? ఎందుకు దాఖలు చేస్తారు? ఎవరు దాఖలు చేస్తారు?

law tips
ప్రతీకాత్మక చిత్రం

ఈవార్తలు, లా టిప్స్: మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వైద్యం, చట్టంపై ప్రజల్లో అవగాహన కలుగుతున్నది. అయితే, ఆయా రంగాల నిపుణులకు తెలిసినంత సమాచారం తెలియకపోయినా ప్రతి ఒక్కరు చట్టంపై కనీస అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఈవార్తలు.కామ్ ద్వారా ప్రజలకు చట్టంపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. ఈ రోజు అంశం.. క్వాష్ పిటిషన్ - QUASH PETITION. అసలు క్వాష్ పిటిషన్ అంటే ఏమిటి? ఎందుకు దాఖలు చేస్తారు? ఎవరు దాఖలు చేస్తారు? అంటే.. ఎవరిపైనైనా పోలీసులు తప్పుడు ఆరోపణలతో ఒక వ్యక్తి లేదా వ్యక్తులపై అన్యాయంగా క్రిమినల్ కేసు (Criminal Case) ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేసి వేధిస్తే సదరు బాధితుడు లేదా బాధితులు హైకోర్టు లేదా సుప్రీం కోర్టును ఆశ్రయించవచ్చు.

ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని సీఆర్పీసీ (CRPC) సెక్షన్ 482 (Section 482) ప్రకారం హైకోర్టు లేదా సుప్రీం కోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయవచ్చు. ఒక కేసు తప్పుడు కేసు అని హైకోర్టు భావిస్తే ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయొచ్చు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 కింద రిట్ పిటిషన్ (Writ Petition) ద్వారా కూడా ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయొచ్చు. ఏదైనా క్రిమినల్ కేసులో చట్టపరమైన ఆధారాలు లేనప్పుడు బాధితులు తమ న్యాయవాది ద్వారా హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసుకోవచ్చు.

వెబ్ స్టోరీస్