Law Tip : పోలీసులు కొడితే ఏం చేయాలి.. వారిని శిక్షించవచ్చా..

Law Tip | కొన్ని సందర్బాల్లో, కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉంటారు. కొందరు పోలీసులు రాజకీయ ఒత్తిడులకు, డబ్బులు లొంగిపోయి సామాన్య ప్రజలను అకారణంగా కొడుతుంటారు.

police beat citizen
ప్రతీకాత్మక చిత్రం

ప్రజలకు పోలీసులు రక్ష. సమాజంలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా చూడటం వారి బాధ్యత. సమాజాన్ని రక్షించటంలో, బాధితులకు న్యాయం చేయటంలో పోలీసులది ముఖ్య పాత్ర. కానీ కొన్ని సందర్బాల్లో, కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉంటారు. కొందరు పోలీసులు రాజకీయ ఒత్తిడులకు, డబ్బులు లొంగిపోయి సామాన్య ప్రజలను అకారణంగా కొడుతుంటారు. ఇలాంటి సందర్భాలు చాలానే జరిగాయి. చాలా సందర్భాల్లో అమాయక ప్రజలను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి అసభ్య పదజాలంతో తిట్టడం, కొట్టడం లాంటి పనులు చేస్తుంటారు. అయితే, పోలీసులు ప్రజలను కొట్టవచ్చా? కొడితే ఏం చేయాలి? ప్రజలను కొట్టే అధికారాన్ని పోలీసులకు రాజ్యాంగం కల్పించిందా? వారిని శిక్షించేందుకు చట్టాలు ఉన్నాయా? ఉంటే ఎలా వారిపై చర్యలు తీసుకోవాలి? అంటే.. ఒక వ్యక్తిని కొట్టే అధికారాన్ని రాజ్యాంగం పోలీసులకు ఇవ్వలేదు.

అసాధారణ విషయాల్లో తప్పతే ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని కొట్టే అధికారం పోలీసులకు లేదు. నేరస్థులు, అనుమానితులను చిత్రహింసలకు గురిచేస్తే అది నేరం కిందికే వస్తుంది. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 330, 331 ప్రకారం.. నేరమే అవుతుంది. ఏదైనా ఒక కేసు విషయంలో ఒక వ్యక్తిని పోలీసులు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి వారిని కొడితే, చట్టప్రకారం సదరు పోలీస్ అధికారి శిక్షకు అర్హుడేనని చట్టం చెప్తోంది. ఒక వ్యక్తిని శారీరకంగా గాయపరిస్తే, ఆ గాయపరిచిన అధికారికి సుమారు 7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించవచ్చు అని చట్టం స్పష్టం చేసింది.

చిత్రహింసలను నిరోధించాలంటే పోలీసులు పారదర్శకంగా విచారణ చేయాలి. ఎటువంటి ఒత్తిడులకు తలొగ్గకుండా, ఎలాంటి ప్రలోభాలకు పోకుండా న్యాయ విచారణ చేపట్టాలి. అలా అయితేనే బాధితులకు న్యాయం జరుగుతుంది. ఇలాంటి చట్టాలు ఉన్నప్పటికీ.. పోలీసుల చేతిలో చిత్రహింసలకు గురైన సందర్భాల్లో.. చాలా మంది వారంటే భయంతో ఫిర్యాదు చేయటానికి ముందుకు రావడం లేదు. అయితే, న్యాయవాది ద్వారా పోలీస్ ఎదుట హాజరైతే ఇలాంటి చిత్రహింసల నుంచి బయటపడగలుగుతారు.

వెబ్ స్టోరీస్