ఏ తప్పూ చేయకున్నా పోలీసులు కొట్టడం, వేధింపులకు గురి చేయడం లాంటివి చేస్తున్న సంఘటనలు అనేకం చూస్తున్నాం. ఏదైనా గొడవ జరిగితే, రాజకీయ నాయకులు తప్పుడు కేసులు పెట్టించి పోలీసులతో కొట్టించాలని చూసినా, మనం ఏం తప్పు చేయలేదని పోలీసులకు తెలిసినా.. కొందరు పోలీసులు సామాన్యులను హింసిస్తుంటారు.
ప్రతీకాత్మక చిత్రం
లా టిప్స్, ఈవార్తలు : సాధారణంగా చాలామంది సామాన్యులకు చట్టంపై సరైన అవగాహన ఉండదు. పోలీసులు కనిపిస్తే చాలు.. ఏదో తప్పు చేశామా? అన్న భయం మొదలవుతుంది. ఏ తప్పూ చేయకున్నా, పోలీసులు అంటే అదో గుండె దడ. ఇక.. ఏదైనా కేసులో మనం ఇన్వాల్వ్ అయితే ఇక అంతే. అలాంటిది ఏ తప్పూ చేయకున్నా పోలీసులు కొట్టడం, వేధింపులకు గురి చేయడం లాంటివి చేస్తున్న సంఘటనలు అనేకం చూస్తున్నాం. ఏదైనా గొడవ జరిగితే, రాజకీయ నాయకులు తప్పుడు కేసులు పెట్టించి పోలీసులతో కొట్టించాలని చూసినా, మనం ఏం తప్పు చేయలేదని పోలీసులకు తెలిసినా.. కొందరు పోలీసులు సామాన్యులను హింసిస్తుంటారు. పోలీస్ స్టేషన్‌కు పిలిపించి తిట్టడం, లంచం డిమాండ్ చేయడం వంటివి జరుగుతుంటాయి. అలాంటప్పుడు మేం ఏం తప్పు చేశాం అని పోలీసులను ప్రశ్నిస్తే.. వాళ్లు వీర ప్రతాపం ప్రదర్శిస్తారు. అయితే, ఇలాంటప్పుడు ఏం చేయాలి? వారిని ఎలా ఎదుర్కోవాలి? చట్టం సాధారణ పౌరులకు కల్పించే హక్కులు ఏంటి? రాజ్యాంగం ఏం చెప్తోంది? అంటే.. పోలీసుల వేధింపుల నుంచి పౌరులను రక్షించేందుకు రాజ్యాంగం పలు కీలక అంశాలను ప్రస్తావించింది.
పోలీసులు మనల్ని వేధిస్తున్నారని, అనవసరంగా చేయి వేసుకుంటున్నారని తెలిస్తే ఆధారాలతో సహా కోర్టులో ఫిర్యాదు చేయవచ్చు. ఐపీసీ సెక్షన్ 166, 166A ప్రకారం పోలీసులు వేధించారని కోర్టులో ఫిర్యాదు చేయవచ్చు.. కానీ మనం తప్పుడు ఆరోపణలు చేస్తున్నామని పోలీసులు తప్పుడు ఆధారాలు చూపించి కేసును కొట్టేయిస్తారు. ఇలాంటప్పుడు పోలీసులను ప్రాసిక్యూట్ చేయాలంటే పోలీస్ యాక్షన్-1861 సెక్షన్ 29 ప్రకారం లోకాయుక్తలో చీఫ్ జస్టిస్‌కి ఫిర్యాదు చేయవచ్చు. వీలైనంత త్వరగా న్యాయం జరగాలనుకుంటే హైకోర్టులో కేసు ఫైల్ చేసి, ఆధారాలు చూపించాలి. పోలీసులు కొట్టిన దెబ్బలకు గాయాలు అయ్యి ఉంటే ప్రభుత్వ ఆస్పత్రిలో చూపించుకొని, ఆ రిపోర్టును న్యాయమూర్తి ముందు సమర్పించాలి. భారత రాజ్యాంగంలోని హక్కుల ఉల్లంఘన చట్టం అధికరణ-226 ప్రకారం హైకోర్టులో కేసు వేసి పోలీసులపై విచారణ చేయించి, శిక్ష పడేలా చేయొచ్చు.