Law Tip : మనకు ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించే హక్కు ఉందా?

ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే పోలీసులు మిమ్మల్ని అరెస్టు చేస్తున్నారా? ప్రభుత్వ నిర్ణయాలపై మాట్లాడకూడదని హెచ్చరిస్తున్నారా? అయితే, పోలీసులకు హెచ్చరించే హక్కు లేదు. ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించే హక్కు ప్రతి భారతీయుడికి రాజ్యాంగం కల్పించింది.

freedom of expression

ప్రతీకాత్మక చిత్రం

ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే పోలీసులు మిమ్మల్ని అరెస్టు చేస్తున్నారా? ప్రభుత్వ నిర్ణయాలపై మాట్లాడకూడదని హెచ్చరిస్తున్నారా? అయితే, పోలీసులకు హెచ్చరించే హక్కు లేదు. ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించే హక్కు ప్రతి భారతీయుడికి రాజ్యాంగం కల్పించింది. ఆర్టికల్ 19(1)(ఏ) ప్రకారం.. భావప్రకటన స్వేచ్ఛ ప్రతి ఒక్కరి సొంతం. దీన్ని కాలరాయడానికి ఎవరికీ అధికారం లేదు. ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయమైనా.. ప్రజావసరాల కోసం తీసుకొన్న నిర్ణయమైనా.. నచ్చకపోతే నిరభ్యంతరంగా చప్పే హక్కు ప్రతి భారతీయుడికి ఉంది. ఇదే విషయాన్ని సుప్రీం కోర్టు నొక్కి చెప్పింది. ‘ప్రతి విమర్శ.. నేరం కాబోదు. నేరమే అయితే ప్రజాస్వామ్యం బతకదు. పోలీసులు ఇలాంటి సందర్భాల్లో చాలా సున్నితంగా వ్యవహరించాలి. భారత రాజ్యాంగం ఆర్టికల్ 19(1)(ఏ).. భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర్యాన్ని కలిపించింది. దీని ప్రకారం.. విమర్శించే హక్కు ప్రతి భారతీయుడికీ ఉన్నది’ అని స్పష్టం చేసింది.

జావెద్ అహ్మద్ అనే ప్రొఫెసర్ ఆర్టికల్ 370పై విమర్శించినందుకు అరెస్టు చేశారు. దీనిపై ఆయన కోర్టును ఆశ్రయించగా.. ‘ఆర్టికల్ 370పై విమర్శలు చేశారా? ఇంకో దానిపై విమర్శ చేశారా? అన్నదానితో సంబంధం లేదు. ఆయనకు రాజ్యాంగం భావ ప్రకటన స్వేచ్ఛ కల్పించింది. దాన్ని ఎవరూ కాలరాయలేరు. ఇలాంటి అంశాల్లో పోలీసులు కాస్త సున్నితంగా వ్యవహరించాలి’ అని న్యాయమూర్తులు అభయ్ ఎస్ ఓకా, ఉజ్జల్ భుయాన్ నేతృత్వంలోని బెంచీ తేల్చి చెప్పింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్