Law Tip : ఇతరులు ఫోన్ మాట్లాడుకుంటే రికార్డ్ చేయొచ్చా?

భారత టెలిగ్రాఫ్ యాక్ట్ - 1885 ఆర్టికల్ 25 ప్రకారం.. కాల్ రికార్డింగ్ అనేది నేరం. అందుకు 3 సంవత్సరాల వరకు శిక్ష పడొచ్చు. జరిమానా విధించే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో శిక్ష, జరిమానా రెండూ పడొచ్చు.

can we record calls
ప్రతీకాత్మక చిత్రం

ఈవార్తలు న్యూస్: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం సృష్టిస్తున్నది. ఇతరుల ఫోన్ సంభాషణలను వింటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది తమ ఫోన్లలో కాల్ రికార్డింగ్ ఆప్షన్ పెట్టుకొని రికార్డు చేస్తుంటారు. ఆ విషయం అవతలి వాళ్లకు తెలియదు. అదేవిధంగా ఎవరైనా ఇద్దరు మాట్లాడుకుంటుంటే కొంతమంది థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా ఫోన్ సంభాషణలను వింటుంటారు. అయితే, ఇలా చేయడం కరెక్టేనా? అంటే.. భారత రాజ్యాంగం ఆర్టికల్ 21 ప్రకారం చట్టరీత్యా నేరం. జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛను రాజ్యాంగం ప్రసాదించింది. అందువల్ల అవతలివారి జీవించే హక్కును, స్వేచ్ఛను కాలరాస్తే అందుకు శిక్షకు అర్హులే.

అదేవిధంగా, భారత టెలిగ్రాఫ్ యాక్ట్ - 1885 ఆర్టికల్ 25 ప్రకారం.. కాల్ రికార్డింగ్ అనేది నేరం. అందుకు 3 సంవత్సరాల వరకు శిక్ష పడొచ్చు. జరిమానా విధించే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో శిక్ష, జరిమానా రెండూ పడొచ్చు. అయితే ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలు కొన్ని సందర్భాల్లో మాత్రమే ఫోన్ రికార్డింగ్ చేసేందుకు అవకాశం ఉంది. సాధారణ పౌరులకు ఆ హక్కు లేదు.

కోర్టులో రికార్డ్ చేసిన ఆధారం చెల్లుతుందా?

ఆధారాలు సమర్పించే విషయంలో కోర్టులు కొన్ని కీలక విషయాలు వెల్లడించాయి. కాల్ రికార్డింగ్ నేరమే అయినా, దాని సంబంధిత ఆధారాన్ని  సమర్పించేందుకు న్యాయస్థానాలు అనుమతి ఇస్తాయి. చట్ట వ్యతిరేకంగా ఆధారాలు సేకరించినా, ఆ ఆధారం కోర్టులో చెల్లుతుంది అన్నది కోర్టు సారాంశం. కాకపోతే, అనధికారిక కాల్ రికార్డింగ్‌కు కోర్టులు శిక్ష విధిస్తాయి.


వెబ్ స్టోరీస్