(Pic : ప్రతీకాత్మక చిత్రం)
ఈవార్తలు, జాబ్ న్యూస్ : ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (Airport Authority of India) లో భారీ స్థాయిలో ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 596 పోస్టులకు గానూ ఏఏఐ దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఇంజినీరింగ్ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులని ఏఏఐ వెల్లడించింది. ఇందుకోసం అభ్యర్థులు గేట్‌లో అర్హత సాధించి ఉండాలని స్పష్టం చేసింది. సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో 2020, 2021, 2022లో గేట్ అర్హత సాధించిన వారికి అవకాశం ఉండగా, ఆర్కిటెక్చర్ విభాగంలో మాత్రం 2022లో గేట్ అర్హత సాధించి ఉండాలి. బేసిక్ పే - రూ.40,000, డీఏ, ఇంక్రిమెంట్, హెచ్ఆర్ఏ, ఇతర బెనిఫిట్స్ అందుతాయి. https://www.aai.aero/en/careers/recruitment వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ప్రారంభ తేది : 22-12-2022
దరఖాస్తు చివరి తేది : 21-12-2023
ఇతర అర్హతలు :
- భారత ప్రభుత్వ ఆమోదం పొందిన విద్యాసంస్థల్లో చదివి ఉండాలి.
- ఇంజినీరింగ్‌లో కనీసం 60 శాతం మార్కులు సాధించాలి.
- వయసు 21/01/2023 నాటికి 27 ఏండ్లకు మించకూడదు.
- ఓబీసీలకు 3 ఏండ్లు, ఎస్సీ, ఎస్టీలకు 5 ఏండ్ల మినహాయింపు ఉంటుంది.
- దివ్యాంగులకు 10 ఏండ్ల మినహాయింపు ఉంది.
- ఏఏఐలో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా 10 ఏండ్ల మినహాయింపు ఉంది.
పోస్టులు :
1. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజినీరింగ్ - సివిల్) - 62
2. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజినీరింగ్ - ఎలక్ట్రికల్) - 84
3. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రానిక్స్) - 440
4. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఆర్కిటెక్చర్) - 10