Law Tip | హోటళ్లలో మంచి నీళ్లు ఉచితంగా ఇవ్వడం లేదా?

ఏదైనా హోటల్‌కి వెళ్తే మంచి నీళ్లు ఉచితంగా ఇవ్వటం లేదా? లాడ్జిలో టాయిలెట్స్ వాడుకోవడానికి అనుమతించడం లేదా? అయితే వారిపై మీరు చట్టపరంగా పోరాడవచ్చు. ఏ హోటల్‌కు వెళ్లినా సరే.. వెళ్లి తాగడానికి మంచి నీళ్లు కావాలని అడిగితే వాళ్లు ఉచితంగా నీటిని అందించాలి.

water in hotels
ప్రతీకాత్మక చిత్రం

ఏదైనా హోటల్‌కి వెళ్తే మంచి నీళ్లు ఉచితంగా ఇవ్వటం లేదా? లాడ్జిలో టాయిలెట్స్ వాడుకోవడానికి అనుమతించడం లేదా? అయితే వారిపై మీరు చట్టపరంగా పోరాడవచ్చు. ఏ హోటల్‌కు వెళ్లినా సరే.. వెళ్లి తాగడానికి మంచి నీళ్లు కావాలని అడిగితే వాళ్లు ఉచితంగా నీటిని అందించాలి. అర్ధరాత్రి అయినా సరే టాయిలెట్స్ వాడుకోవడానికి అనుమతించాలి. ఇది భారత దేశవ్యాప్తంగా వర్తిస్తుంది. అయితే, చాలా హోటల్స్‌లో మంచి నీళ్లు ఉచితంగా ఇవ్వరు. వాటర్ కావాలని అడగ్గానే బాటిల్ తీసుకొచ్చి చేతిలో పెడతారు. దానికి బిల్లు వేస్తారు. బాటిల్ వద్దు.. అని అంటే నార్మల్ వాటర్ కావాలా? అని అడిగి, శుచి, శుభ్రత లేని.. ఫిల్టర్ చేయని నీళ్లు తీసుకొచ్చి పెడతారు. అయితే, మనం నీళ్లు అడిగితే కచ్చితంగా ఫిల్టర్ చేసిన మంచి నీళ్లు తీసుకొచ్చి పెట్టాలి. ఇది మనకు చట్టం కల్పించిన హక్కు.

ఇండియన్ సరాయిస్ యాక్ట్ 1867 ప్రకారం.. హోటల్స్, లాడ్జిలో కచ్చితంగా మంచినీళ్లు ఉచితంగా ఇవ్వాలి. మనం ఆ హోటల్‌కు తినడానికి వెళ్లకపోయినా, లాడ్జిలో గెస్ట్‌ కాకపోయినా సరే.. టాయిలెట్స్ వాడుకోవడానికి అనుమతించాలి. కానీ చాలా హోటల్స్, లాడ్జిలు టాయిలెట్స్ వాడుకోవడానికి అనుమతించవు. అలాంటప్పుడు సరైన ఆధారాలతో కోర్టులో ఫిర్యాదు చేయవచ్చు. మీతోపాటు తీసుకెళ్లే పెంపుడు జంతువులకు కూడా నీళ్లు ఇవ్వాల్సిందే. వాటి మలమూత్ర విసర్జనకు అనుమతించాల్సిందే. బ్రిటిషర్ల కాలంలోనే ఈ నిబంధనను తీసుకొచ్చారు. ఆ చట్టమే ఇప్పటికీ అమలు అవుతోంది. అయితే ఈ చట్టం హోటల్స్, లాడ్జులకు మాత్రమే పరిమితం. రెస్టారెంట్లు, ఈటరీల్లో ఉచితంగా నీళ్లు ఇవ్వాలని అడగలేం. కానీ, దక్షిణ ఢిల్లీ, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో రెస్టారెంట్లు, ఈటరీల్లోనూ ఉచితంగా మంచినీళ్లు అందించాలన్న నిబంధన ఉంది. అయితే, రైట్ టు ప్రైవసీ యాక్ట్ 2017 ప్రకారం.. దేశవ్యాప్తంగా ఉన్న రెస్టారెంట్లు, ఈటరీలు కచ్చితంగా మంచినీళ్లు ఉచితంగా ఇవ్వాలని, టాయిలెట్స్ వాడుకోవడానికి అనుమతించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్