Munnar Tour | మున్నార్ టూర్‌కు ప్లాన్ చేస్తున్నారా.. కచ్చితమైన ప్లాన్ ఉంటే టెన్షన్ లేని జర్నీ..

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

|| మున్నార్, కేరళ రాష్ట్రం ||

ఈవార్తలు, టూర్ న్యూస్: కేరళ టూర్‌కు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? ముఖ్యంగా మున్నార్ అంటే కావాల్సినంత ప్రకృతి అందాల విందు. ఇక్కడ అందమైన పచ్చని హిల్ స్టేషన్ తేయాకు తోటలు, రోజ్ గార్డెన్, పదుల కొద్దీ జలపాతాలు ఇలా చాలా అందంమైన ప్రదేశాలు ఉంటాయి. మీరు రోడ్డు మార్గంలో వెళ్లాలనుకుంటే హైదరాబాద్ నుండి మున్నార్‌ 19  గంటల సమయం పడుతుంది. ఇలాకాకుండా ఫ్లైట్‌‌లో వెళ్లాలనుకుంటే హైదరాబాద్ నుండి కొచ్చికి ఫ్లైట్ ఉంటుంది. అక్కడికి చేరుకునేందుకు 1 గంట 45 నిమిషాలు పడుతుంది. కొచ్చి నుండి మున్నార్‌కు నాలుగు గంటల సమయం పడుతుంది. అలాగే బస్సు, రైలు, టాక్సీ లలో కూడా వెళ్ళవచ్చు. అయితే ఎలా వెళ్లాలో చూద్దాం..


1. విమానంలో హైదరాబాద్ నుండి మున్నార్ ఎలా వెళ్ళాలంటే..

హైదరాబాద్ నుంచి కొచ్చి ఫ్లైట్ (ఇండిగో, గో ఎయిర్, ఎయిర్ ఏషియా) సంస్థలు ఈ మార్గంలో క్రమం తప్పకుండా విమానాలను నడుపుతుంటాయి. కొచ్చి నుండి మున్నార్‌కు రోడ్డు మార్గంలో దాదాపు నాలుగు గంటల్లో చేరుకోవచ్చు. 

ఫ్లైట్ ప్రయాణ ఖర్చు : INR 2800 నుంచి ప్రారంభం

డిపార్చర్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం

అరైవల్ : కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం

ప్రయాణ సమయం: 1 గంట 45 నిమిషాలు 

ట్యాక్సీ ద్వారా కొచ్చి నుండి మున్నార్‌కు : 

సుమారు టాక్సీ ఛార్జీ : INR 3,000

ప్రయాణ సమయం: 4 గంటలు (దూరం:  110 కి.మీ.)


2. హైదరాబాద్ నుండి మున్నార్‌కు రోడ్డు మార్గం 

హైదరాబాద్ నుండి రహదారి ప్రయాణం చాలా దూరం ఉంటుంది. ఈ యాత్రకు దాదాపు 19 గంటల సమయం పడుతుంది. సుమారు దాదాపు 1050 కి.మీ. దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది.

ప్రయాణ సమయం: 19 గంటలు

ట్యాక్సీ చార్జీ : INR 10000

రూట్ 1 : NH 44 ద్వారా దూరం: 1052 కి.మీ

రూట్ 2: NH 44 మరియు మున్నార్ ఉడుమల్‌పేట్ రోడ్ ద్వారా దూరం: 1028 కి.మీ (సమయం: 20 గంటలు)


3. హైదరాబాద్ నుండి మున్నార్ వరకు బస్సులో 

ప్రారంభ స్థానం : హైదరాబాద్

గమ్య స్థానం : మున్నార్

ప్రయాణ సమయం: 27 గంటలు

దూరం : 1185 కి.మీ

టిక్కెట్ ధర: INR 1800

 

4. రైలు, టాక్సీ ద్వారా హైదరాబాద్ నుండి మున్నార్

రైలులో హైదరాబాద్ నుండి అలువా

ప్రయాణ సమయం: 25 గంటల 40 నిమిషాలు

దూరం : 1325 కి.మీ

టిక్కెట్ ధర: సుమారు INR 600

టాక్సీలో అలువా నుండి మున్నార్ వరకు

సుమారు టాక్సీ చార్జీ: INR 3000

ప్రయాణ సమయం: 2 గంటలు

దూరం:  115 కి.మీ.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్