||ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతున్న కొండపల్లి రఘు||
(ఎల్బీనగర్, ఈవార్తలు, దేవులపల్లి రంగారావు)
ఆర్థిక సంబంధాలు పెరిగి మానవ సంబంధాలు దూరమవుతున్న నేపథ్యంలో అందరినీ దగ్గరికి చేర్చుకోవడానికి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగిందని ప్రముఖ కవి రచయిత కొండపల్లి రఘు అన్నారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని వెంగమాంబ బంకెట్ హాల్లో జరిగిన కొండపల్లి రాధ, లక్ష్మీ కిషన్ రావు జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్ననాటి ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆ రోజులు మళ్ళీ రావని, చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు, పాడుకున్న పాటలు అద్భుతమని అన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ దేవులపల్లి శేషగిరిరావు దేవులపల్లి రమేష్ కుమార్, ప్రముఖ జర్నలిస్టు, తేజ పత్రిక సంపాదకులు దేవులపల్లి వెంకట ప్రభాకర్ రావు గారి అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉత్తమ విశ్రాంత ఉపాధ్యాయులు దేవులపల్లి వెంకటేశ్వరరావు, కొండపల్లి మనోహర్ రావు, ప్రముఖ రచయిత్రి హిమబిందు దేశముఖ్ కోటగిరి రావు, ఆయన సోదరి నారపరాజు జయప్రద, కొండపల్లి భార్గవ, డాక్టర్ సహిష్ణవి, కొండపల్లి అప్నా జ్యోతి, దేవులపల్లి కృష్ణారావు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ దేవులపల్లి శేషు కుమారి, తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ ఉపాధ్యక్షులు దేవులపల్లి రంగారావు, తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ ఉపాధ్యక్షులు చకిలం రంగారావు, సీనియర్ జర్నలిస్టు అక్కినేపల్లి పురుషోత్తమరావు, కోటమర్తి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.