తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్ (TGCAB)లో ఉద్యోగాలు..

తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్ (TGCAB).. ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఇంటర్న్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

bank jobs

ప్రతీకాత్మక చిత్రం 

తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ నుంచి ఉద్యోగ ప్రకటన వెలువడింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా.. కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ ఇంటర్న్స్ పోస్టులను భర్తీ చేయనుంది. తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్ (TGCAB).. ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఇంటర్న్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. ఈ ప్రకటన ద్వారా 10 ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో 9 ఖాళీలు డిస్ట్రిక్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ (డీసీసీబీ)ల్లో ఉన్నాయి. అర్హత, ఆసక్త గల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. నవంబర్‌ 30 ఆఫ్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ https://tscab.org/ చూడొచ్చు. అప్లికేషన్‌ ఫామ్‌ లింక్‌ ఇదే.. క్లిక్‌ చేయండి.

మొత్తం ఖాళీల సంఖ్య: 10

తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్‌ బ్యాంక్‌ (టీజీసీఏబీ): 01

డిస్ట్రిక్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ (డీసీసీబీ): 09

ఇతర ముఖ్యమైన సమాచారం :

విద్య అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీఏ (మార్కెటింగ్/ కోఆపరేటివ్/ అగ్రి బిజినెస్/ రూరల్ డెవలప్‌మెంట్), పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 21-30 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతం: నెలకు రూ.25,000 వరకు వేతనం ఉంటుంది.

పని ప్రదేశాలు: ఆదిలాబాద్, హైదరాబాద్ (Hyderabad), ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌నగర్‌, మెదక్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్ ప్రాంతాల్లో పని చేయాల్సి ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల్లో సాధించిన మార్కులు, షార్ట్‌ లిస్ట్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను ‘ది డిప్యూటీ జనరల్ మేనేజర్, హ్యుమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్, ది తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ట్రూప్ బజార్, హైదరాబాద్’ చిరునామాకు పంపించాలి.

చివరి తేది: నవంబర్ 30


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్