ఏడో తరగతి చదివినా ఉద్యోగ అవకాశం.. జగిత్యాల పోలిస్ శాఖ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా

నిరుద్యోగ యువతి, యువకుల కోసం జగిత్యాల పోలీస్ శాఖ శుభవార్త చెప్పింది. ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్న వాళ్ల కోసం మంచి అవకాశం కల్పిస్తోంది. 2016 నుండి 2024 మధ్య ఏడో తరగతి మొదలుకొని, ఎంటెక్, బిటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఫార్మసీ, బీ ఫార్మసీ, ఏదైనా పీజీ, డిగ్రీ, ఇంటర్, టెన్త్, ఐటిఐ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.

JOB NOTIFICATION

జగిత్యాల పోలిస్ అధ్వార్యంలో మేగా జాబ్ మేళా

జగిత్యాల, ఈవార్తలు : నిరుద్యోగ యువతి, యువకుల కోసం జగిత్యాల పోలీస్ శాఖ శుభవార్త చెప్పింది. ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్న వాళ్ల కోసం మంచి అవకాశం కల్పిస్తోంది. 2016 నుండి 2024 మధ్య ఏడో తరగతి మొదలుకొని, ఎంటెక్, బిటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఫార్మసీ, బీ ఫార్మసీ, ఏదైనా పీజీ, డిగ్రీ, ఇంటర్, టెన్త్, ఐటిఐ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. మొత్తంగా 2000కు పైగా ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఈ మెగా జాబ్ మేళాలో 50కి పైగా కంపెనీలు పాల్గొంటున్నట్టు వివరించారు. డిసెంబర్ 11న (బుధవారం రోజు) ఉదయం 10 గంటల నుంచి ఇంటర్వ్యూలు జరుగుతాయని వివరించారు. ఇంటర్వ్యూలు జగిత్యాలలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో నిర్వహించనున్నారు. ఉద్యోగ మేళాకు హజరయ్యే నిరుద్యోగ అభ్యర్థులు ఈ లింక్ Registration ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. జాబ్ మేళాకు హజరయ్యే రోజున అభ్యర్థులు ఐదు బయోడేటా కాపీలు, అన్ని సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలు తీసుకొనిరావాలి.

గుర్తుంచుకోవాల్సిన వివరాలు:

ఇంటర్వ్యూ తేది: డిసెంబర్ 11

ఖాళీలు:  ఐటిఐ, ఐటిఈఎస్, మేనేజ్‌మెంట్, బ్యాంకింగ్, ఫార్మా, మార్కెటింగ్, కోర్ టెక్నికల్, మానుఫ్యాక్చరింగ్, ఇతర సంబంధిత రంగాల్లో 2 వేలకు పైగా ఉద్యోగాలు

ఇంటర్వ్యూ జరుగు ప్రదేశం:  పోలీస్ హెడ్ క్వార్టర్స్, జగిత్యాల


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్