Jobs Telangana : 5,204 స్టాఫ్ నర్సుల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

evarthalu
ప్రతీకాత్మక చిత్రం


(Pic : ప్రతీకాత్మక చిత్రం)

ఈవార్తలు, తెలంగాణ : తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు రోజుకో శుభవార్త చెప్తోంది. వరుసపెట్టి నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. నిన్నకినిన్న గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేయగా, తాజాగా భారీ స్థాయిలో స్టాఫ్ నర్సుల పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఏకంగా 5,204 స్టాఫ్ నర్సుల పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపింది. మొత్తం పోస్టుల్లో 3823 పోస్టులు డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ విభాగాల్లోనివి కాగా, 757 పోస్టులు వైద్య విధాన పరిషత్తులో భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. వీటితో పాటు మరికొన్ని విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తామని పేర్కొన్నది. ఈ పోస్టులను మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా నియామకాలు చేపట్టనుంది. పూర్తి వివరాలకు https://mhsrb.telangana.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.

దరఖాస్తు వివరాలు: 

దరఖాస్తు ప్రారంభం : జనవరి 25, 2023

దరఖాస్తుకు చివరి తేది : ఫిబ్రవరి 15, 2023

పోస్టుల వివరాలు : 

స్టాఫ్ నర్స్ (డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్) - 3,823

స్టాఫ్ నర్స్ (తెలంగాణ వైద్య విధాన పరిషత్) - 757

స్టాఫ్ నర్స్ (ఎమ్ఎన్‌జే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ అండ్ రీజినల్ క్యాన్సర్ సెంటర్) - 81

స్టాఫ్ నర్స్ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిసెబుల్డ్ అండ్ సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్) - 8

స్టాఫ్ నర్స్ (తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ) - 127

స్టాఫ్ నర్స్ (మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ బ్యాక్ వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ - 197

స్టాఫ్ నర్స్ (తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (గురుకులం)) - 74

స్టాఫ్ నర్స్ (తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ) - 124

స్టాఫ్ నర్స్ (తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ) - 13

మొత్తం - 5,204


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్