Law Tip : మీ సొంత వాహనంలో వేరేవాళ్లకు లిఫ్ట్ ఇవ్వడం నేరమా.. చట్టం ఏం చెబుతోందంటే..

మోటారు వాహనాల చట్టం (Motor Vehicle Act) సెక్షన్ 66/192 రూల్ ప్రకారం ప్రైవేటు వాహనాలను (Individual Vehicles) టాక్సీలుగా వాడకూడదు. అంటే.. సొంత వాహనాన్ని పర్మిట్ (Permit) లేకుండా కమర్షియల్ వాహనంగా వాడరాదు. మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 66 ప్రకారం సరైన అనుమతులు లేకుండా వాహనాన్ని బహిరంగ ప్రదేశాల్లో రవాణా వాహనంగా వాడరాదు.

lift in car
ప్రతీకాత్మక చిత్రం

ఈవార్తలు, లా న్యూస్: రోడ్డుపై బైక్‌పైనో, కారులోనో వెళ్తుండగా మీకు తెలియని వాళ్లకు మీ సొంత వాహనంలో లిఫ్ట్ ఇస్తున్నారా? అయితే మీరు చట్టాన్ని అతిక్రమిస్తున్నారన్న విషయం తెలుసా? అవును.. మీ సొంత వాహనాన్ని టాక్సీలుగా వాడటం నేరం అని చట్టం చెప్తోంది. అలా లిఫ్ట్ ఇచ్చి ఓ ఐటీ కంపెనీ ఓటర్ ఏకంగా కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఫైన్ కట్టించుకోవటంతో పాటు కోర్టు వార్నింగ్ కూడా ఇచ్చింది. ఈ చేదు అనుభవం ముంబైలోని నితిన్ నాయర్ అనే ఐటీ కంపెనీ ఓనర్‌కు ఎదురైంది. వివరాళ్లోకి వెళ్తే.. ఓ ఐటీ కంపెనీలో పనిచేసే నాయర్.. ఈ మధ్యే ఒక కొత్త కంపెనీ పెట్టాడు. ఓ రోజు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుండగా, ముంబైలోని ఐరోలి సర్కిల్ వద్ద ఆగాడు. అప్పటికే వర్షం బాగా పడుతోంది. రోడ్లపై నీళ్లు చేరాయి. ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆ సమయంలో ముగ్గురు వ్యక్తులు వర్షంలో తడుస్తూ లిఫ్ట్ కోసం చూస్తున్నారు.

వాళ్ల బాధ తెలుసుకున్న నాయర్.. కారులో ఎక్కించుకొని ఎక్కడికి వెళ్లాలో తెలుసుకున్నాడు. ఇది గమనించిన పోలీస్ అధికారి.. నాయర్ కారు వద్దకు వచ్చి పరిస్థితి ఏంటని అడిగి.. రూ.1500 చలానా అతని చేతిలో పెట్టాడు. దీంతో విస్తుపోయిన నాయర్.. చలానా ఎందుకు అని ప్రశ్నించాడు. లిఫ్ట్ ఇవ్వడం నేరం అని ఆ పోలీస్ అధికారి చెప్పాడు. ‘సెక్షన్ 66/192 రూల్ ప్రకారం లిఫ్ట్ ఇవ్వడం నేరం. రూ.1,500 చలానా కోర్టులో కట్టి, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకెళ్లు’ ఆ పోలీస్ వార్నింగ్ ఇచ్చాడు. ఆ షాక్‌లోనే ఉన్న నాయర్.. కారులో ఎక్కించుకున్నవాళ్లను వారి ప్రదేశాల్లో దింపి ఇంటికి వెళ్లాడు. తర్వాత రోజు కోర్టుకు వెళ్లి జరిమాన కట్టాడు. అనంతరం ఆ రసీదుతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు రసీదు చూపించి డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకున్నాడు. నాయర్ లాగే చాలా మందికి లిఫ్ట్ ఇవ్వడం నేరం అనే విషయం తెలియక.. సానుభూతితో లిఫ్ట్ ఎక్కించుకుంటారు. అయితే చట్టం ఏం చెప్తున్నదో తెలుసుకోవాలి.

చట్టం ఏం చెప్తోందంటే.. 

ప్రైవేటు వాహనాలను టాక్సీలుగా వాడకూడదు. అంటే.. సొంత వాహనాన్ని పర్మిట్ లేకుండా కమర్షియల్ వాహనంగా వాడరాదు. మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 66 ప్రకారం సరైన అనుమతులు లేకుండా వాహనాన్ని బహిరంగ ప్రదేశాల్లో రవాణా వాహనంగా వాడరాదు. అలా చేస్తే తగిన శిక్షార్హులు. చెల్లుబాటు అయ్యే పర్మిట్ లేకుండా, పర్మిట్‌లో పేర్కొన్న షరతులను ఉల్లంఘిస్తే, రవాణా కోసం వాహనాన్ని ఉపయోగించినా చట్ట ప్రకారం నేరమే. వాణిజ్య ప్రయోజనాల కోసం మోటారు వాహనాలకు ఆర్టీఏ నుంచి అనుమతి ఉండి తీరాలి. అందుకు ఎల్లో ప్లేట్ వాహనాలే వాడాలి. అయితే, నాయర్ కేసులో పోలీసులు.. ప్రైవేట్ వాహనాన్ని టాక్సీగా వాడినట్టు పొరబడి ఉండొచ్చు. అందుకే ఆయనకు చలానా విధించారు. కానీ, లిఫ్ట్ ఇవ్వడం నేరం కాదు.. కాకపోతే వారి నుంచి డబ్బులు వసూలు చేయడం మాత్రం నేరమే.

వెబ్ స్టోరీస్