భారత వాతావరణ విభాగం తాజాగా వాతావరణ పరిస్థితులపై కీలక అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఏప్రిల్ 12వ తేదీ వరకు దక్షిణ భారత దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
ప్రతీకాత్మక చిత్రం
భారత వాతావరణ విభాగం తాజాగా వాతావరణ పరిస్థితులపై కీలక అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఏప్రిల్ 12వ తేదీ వరకు దక్షిణ భారత దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. గంటకు 4,050 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, పలు ప్రాంతాల్లో పిడుగుపాటు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ వర్ష సూచనల ప్రభావం కోస్తాంధ్ర, యానాం, తెలంగాణ, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో కనిపించనున్నట్లు ఐఎండీ పేర్కొంది. సముద్ర తీర ప్రాంతాల్లో ఈదురుగాలులు, పిడుగుపాట్ల ప్రభావం ఉండే అవకాశముందని తెలిపింది. ఇక గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వడగాలులు కొనసాగుతాయని ఐఎండీ అంచనా వేసింది. ఏప్రిల్ 9, 10 తేదీల్లో అసోం, మేఘాలయలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, ఏప్రిల్ 10న అరుణాచల్ ప్రదేశ్‌లో కూడా భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. ఈ రోజు నుంచి ఏప్రిల్ 11వ తేదీ వరకు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ తెలిపింది.
వాయవ్య భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఏప్రిల్ 10న వర్ష సూచనలు ఉన్నాయి. నైరుతి, ఆగ్నేయ దిశల్లో ఏర్పడిన అల్పపీడనం రాబోయే 24 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం విూదుగా వాయవ్యం, ఉత్తర దిశల వైపుగా కదిలే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. వర్షాలు, ఈదురుగాలులు, పిడుగుపాట్ల సమయంలో ప్రజలు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని, అవసరమైన వేళల్లో మాత్రమే ప్రయాణాలు చేయాలని వాతావరణ శాఖ సూచించింది. అలాగే వ్యవసాయదారులు తమ పంటలను సంరక్షించేలా ముందు జాగ్రత్తలు తీసుకోవాలంటూ సూచించింది.