Cheque Bounce Case : ఎవరైనా మనకు డబ్బు చెల్లించేప్పుడు చెక్కు రూపంలో అందజేస్తే, ఆ చెక్కుకు సంబంధించిన బ్యాంకు అకౌంట్‌లో సరిపడా నగదు లేకపోతే చెక్ బౌన్స్ అవుతుంది. చెక్ బౌన్స్ కావటం చట్టరీత్యా నేరం. ఈ సందర్భంలో సదరు డిపాజిట్‌దారు చెక్ బౌన్స్‌పై ఫిర్యాదు చేయవచ్చు.
ప్రతీకాత్మక చిత్రం
లా టిప్స్, ఈవార్తలు : ఎవరైనా మనకు డబ్బు చెల్లించేప్పుడు చెక్కు రూపంలో అందజేస్తే, ఆ చెక్కుకు సంబంధించిన బ్యాంకు అకౌంట్‌లో సరిపడా నగదు లేకపోతే చెక్ బౌన్స్ అవుతుంది. చెక్ బౌన్స్ కావటం చట్టరీత్యా నేరం. ఈ సందర్భంలో సదరు డిపాజిట్‌దారు చెక్ బౌన్స్‌పై ఫిర్యాదు చేయవచ్చు. క్రిమినల్ కేసు పెట్టి చెక్ జారీ చేసిన వ్యక్తిని జైల్లో పెట్టొచ్చు. దానికోసం మనం ఏం చేయాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అంటే.. ముందుగా, చెక్ ఏ తేదీన రాసిస్తారో ఆ తేదీ నుంచి 3 నెలల లోపు బ్యాంకులో జమ చేయాలి. ఆ చెక్ డిపాజిట్ చేసే సమయంలో బ్యాంకు ఖాతాలో సరిపడా డబ్బు లేకపోతే చెక్ బౌన్స్ అయ్యిందని చెప్పి, బ్యాంకు అధికారి రిటర్న్ మెమో Return Memo రాసి స్టాంప్ వేసిస్తారు. ఆ బౌన్స్ అయిన చెక్‌ను, రిటర్న్ మెమోను 30 రోజుల్లోగా లాయరు ద్వారా NI ACT NEGOTIABLE INSTRUMENTS ACT 138 1881 ప్రకారం లీగల్ నోటీస్ జారీ చేయవచ్చు. ఆ నోటీస్ జారీ చేసిన 15 రోజుల లోపు ఆ నోటీస్‌కు సమాధానం వచ్చి, డబ్బు చెల్లిస్తే ఓకే. అలా కాకుండా, 15 రోజుల్లోపు సమాధానం రాకపోతే, డబ్బు చెల్లించకపోతే నిందితునిపై చెక్ బౌన్స్ కేసు దాఖలు చేయవచ్చు. ఆ చెక్కుకు సంబంధించిన బ్యాంకు, ఆ బ్యాంకు ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందో, ఏ కోర్టు పరిధిలోకి వస్తుందో.. ఆ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అవుతుంది.
చెక్ బౌన్స్ రకాలు
1. సరిపడా బ్యాంకు బ్యాలెన్స్ లేకపోయినా
2. చెక్ చెల్లుబాటు గడువు ముగిసినా
3. చెల్లింపులను ఆపాలని ఖాతాదారుడు కోరినా
4. పాడైన చెక్ అందజేసినా
5. చెక్‌లో సంతకం సరిపోలకపోయినా
6. టోటల్ అమౌంట్, అంకెలు సరిపోలకపోయినా
కేసు నమోదు చేసే సమయంలో అవసరమైన పత్రాలు
1. చెక్ జారీచేసిన వ్యక్తికి పంపిన లీగల్ నోటీస్ కాపీ
2. బౌన్స్ అయిన ఒరిజినల్ చెక్
3. రిటర్న్ మెమో
4. లీగల్ నోటీస్ పంపిన కొరియర్ రసీదు
చెక్ బౌన్స్‌కు శిక్ష
- చెక్ బౌన్స్ అయితే ఖాతాదారుడికి రెండు సంవత్సరాల జైలు శిక్ష పడొచ్చు.
- లేకపోతే చెక్ విలువకన్నా రెట్టింపు జరిమానా విధించొచ్చు.
- కొన్ని సందర్భాల్లో పై రెండు శిక్షలూ విధించే అవకాశం ఉంటుంది.