Driving License | డ్రైవింగ్ లైసెన్స్‌లో ఫోటో చేంజ్ చేసుకోవడం ఎలాగంటే..

డ్రైవింగ్ లైసెన్స్ లోని ఫోటోను ఇప్పుడు ఆన్‌లైన్ ద్వారా అప్‌డేట్ చేసుకోవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ అనేది రహదారులపై ప్రయాణించడానికి వ్యక్తులను అనుమతించే చట్టపరమైన పత్రం.

driving license photo update
ప్రతీకాత్మక చిత్రం

డ్రైవింగ్ లైసెన్స్‌లో ఫోటో మార్చుకోవాలని చాలా మంది అనుకుంటారు. కానీ ఎలా మార్చాలో తెలీక పాత ఫొటోతోనే నెట్టుకొస్తుంటారు. ఏదైనా డాక్యుమెంట్లతో పోల్చితే తేడా వస్తే ఇబ్బందులు తప్పవు. ఇప్పుడు ఆ బాధ లేకుండా ఆన్‌లైన్‌లో ఆప్‌డెట్ చేసుకోవచ్చని చట్టం వెల్లడించింది. మీ డ్రైవింగ్ లైసెన్స్ లోని ఫోటోను ఇప్పుడు ఆన్‌లైన్ ద్వారా అప్‌డేట్ చేసుకోవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ అనేది రహదారులపై ప్రయాణించడానికి వ్యక్తులను అనుమతించే చట్టపరమైన పత్రం. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండకపోతే 1988 మోటర్ వాహనాల ప్రకారం శిక్షార్హమైన నేరం. 

మీ డ్రైవింగ్ లైసెన్స్ ఫోటో అప్‌డేట్ చేసే ప్రక్రియను ప్రారంభించడానికి, అధికారిక వెబ్‌సైట్ https://parivahan.gov.in/ను సందర్శించాలి.

వెబ్‌సైట్‌లో సంబంధిత సేవలను ఎంచుకుని, DLలో మీ రాష్ట్రం సేవను ఎంచుకోవాలి.

మీ లైసెన్స్ వివరాలు యాక్సెస్ చేయడానికి మీ పుట్టిన తేది, లైసెన్స్ నంబర్‌ను నమోదు చేయాలి.   

చిరునామా కూడా చేంజ్ చేసుకోవాలంటే మీరు “వివరాలను పొందండి” బటన్‌ను ఎంచుకోవాలి.

ఇది మీ డ్రైవింగ్ లైసెన్స్ వివరాలను ప్రదర్శిస్తుంది.

అవసరమైన RTO వివరాలను నమోదుచేసి, డ్రైవింగ్ లైసెన్స్ ఫోటోను మార్చడానికి కొనసాగాలి.

తాజా ఫోటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి

ఇందుకు రూ.460, రూ.45 సర్వీస్ చార్జీని చెల్లించడం ద్వారా ప్రక్రియ పూర్తి అవుతుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్