Traffic Challan | తప్పుగా ట్రాఫిక్ చలాన్ పడిందా.. ఫిర్యాదు చేసి తొలగించుకోవచ్చిలా..

కొన్ని సందర్భాల్లో తప్పుడు ట్రాఫిక్ చలాన్లు పడుతుంటాయి. వాటిని తొలగించుకునేందుకు అవకాశం లేదనుకొని.. చాలా మంది పేమెంట్ చేస్తుంటారు. అయితే, తప్పుడు ట్రాఫిక్ చలాన్లను కూడా తొలగించుకోవచ్చు.

traffic challan
ప్రతీకాత్మక చిత్రం

ఈవార్తలు : కొన్ని సందర్భాల్లో తప్పుడు ట్రాఫిక్ చలాన్లు పడుతుంటాయి. వాటిని తొలగించుకునేందుకు అవకాశం లేదనుకొని.. చాలా మంది పేమెంట్ చేస్తుంటారు. అయితే, తప్పుడు ట్రాఫిక్ చలాన్లను కూడా తొలగించుకోవచ్చు. ట్రాఫిక్ చలాన్‌ నంబర్‌తో ఆ చలాన్‌ను ట్రాఫిక్ పోలీసుల వద్ద రద్దు చేయించుకోవచ్చు. దానికోసం ఈ కింది విధానాలను పాటించాలి.

1. ట్రాఫిక్ చలాన్ నంబర్, VOZ app లేదా echallan.parivahan.gov.in వెబ్‌సైట్‌లో చెక్ చేయండి.

2. తప్పుడు చలాన్‌కు సంబంధించిన వివరాల స్క్రీన్ షాట్‌తో ఆర్టీవో లేదా ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్‌కు పంపవచ్చు.

3. మీ జిల్లా ట్రాఫిక్ పోలీసుల అధికారిక వెబ్‌సైట్ లేదా ట్విట్టర్, ఫేస్‌బుక్ లాంటి సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ఫిర్యాదు చేయాలి.

4. మీ రాష్ట్ర ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ లేదా వాట్సాప్ చేయవచ్చు.

5. ఆర్టీఐ ద్వారా సమాచారం కోరవచ్చు. ఈ-చలాన్ ఎందుకు వేశారు అని అడగవచ్చు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్