టీజీ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రూప్-1 మెయిన్స్ ఉచిత శిక్షణ

గ్రూప్-1 మెయిన్స్‌ కోసం ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలంగాణ వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తుల ఉపాధి క‌ల్పన, నైపుణ్యాభివృద్ది శిక్షణ కేంద్రం (టీజీబీసీఈఎస్‌డీటీసీ) డైరెక్టర్ శ్రీ‌నివాస్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

tg bc study circle

తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్, హైదరాబాద్

హైదరాబాద్, ఈవార్తలు : గ్రూప్-1 మెయిన్స్‌ కోసం ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలంగాణ వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తుల ఉపాధి క‌ల్పన, నైపుణ్యాభివృద్ది శిక్షణ కేంద్రం (టీజీబీసీఈఎస్‌డీటీసీ) డైరెక్టర్ శ్రీ‌నివాస్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 75 రోజులపాటు నిర్వహించే శిక్షణ ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. శిక్షణ పొందాల‌నుకునే అభ్యర్థులు తమ దరఖాస్తును www.tgbcstudycircle.cgg.gov.in లో స‌మ‌ర్పించాలని సూచించారు. ద‌ర‌ఖాస్తు చేసే అభ్యర్థుల త‌ల్లిదండ్రుల వార్షికాదాయం రూ.5 ల‌క్షల లోపు ఉండాలని, రోల్ ఆఫ్ రిజ‌ర్వేష‌న్ ప్రకారం ఉచిత శిక్షణకు అభ్యర్థులను ఎంపిక చేస్తామని వెల్లడించారు.

ఎంపికైన వారికి శిక్షణ కాలంలో నెల‌కు రూ.5,000 ఉప‌కార వేత‌నం (బుక్ ఫండ్‌, ర‌వాణా స‌హ‌) అందజేస్తామని వివరించారు. హైద‌రాబాద్ సైదాబాద్‌లోని టీజీ బీసీ స్టడీ స‌ర్కిల్ (రోడ్ నంబర్ 8, ల‌క్ష్మీన‌గ‌ర్‌), ఖ‌మ్మంలోని టీజీ బీసీ స్టడీ స‌ర్కిల్‌లో ఉచిత శిక్షణ ఉంటుందని తెలిపారు. మరింత సమాచారం కోసం 040-24071188 నంబర్‌కు ఫోన్ చేసి సంప్రదించాలని పేర్కొన్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్