సత్కారం అనేది అదనపు ఆక్సిజన్ లాంటిది: దైవజ్ఞ శర్మ

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||మాట్లాడుతున్న దైవజ్ఞ శర్మ||

(రంగారెడ్డి, ఈవార్తలు ప్రతినిధి, అక్కినేపల్లి పురుషోత్తమరావు)

కళాకారులకు ,వేదమూర్తులకు, అర్చకులకు, సత్కారం అనేది ఎక్స్ట్రా ఆక్సిజన్ లాంటిదని ప్రముఖ సంఖ్యాశాస్త్ర నిపుణులు సరస్వతీ ఉపాసకులు దైవజ్ఞశర్మ అన్నారు. ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ పోలా ప్రగడ సుబ్బారావు పోలా ప్రగడ కళానిలయం పదవ వార్షికోత్సవం నెహ్రూ జయంతి బాలల దినోత్సవ సందర్భంగా జరిగిన ఐరావతం-2023 అవార్డుల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వివిధ రంగాలలో నిష్ణాతులైన నిపులైన వారిని కళాకారులను వారి లబ్ద ప్రతిష్టలను గుర్తించి ప్రోత్సహిస్తూ సిల్వర్ ఎలిఫెంట్ అవార్డు ఇవ్వడం అభినందనీయమని దైవజ్ఞశర్మ అన్నారు. పదిమందిని కలుపుకొని పోయే మనస్తత్వం ఉన్న డాక్టర్ పోలా ప్రగడ సుబ్బారావు వృత్తి ఏదైనా ప్రవృత్తి కళలను ప్రోత్సహించడం అని అన్నారు. ఈ నేపథ్యంలో 20 మంది వివిధ రంగాలలో నిష్ణాతులైన వ్యక్తులను గుర్తించి వారికి అవార్డులు అందజేయడం అభినందనీయమని అన్నారు.

కార్యక్రమంలో పోలా ప్రగడ సుబ్బారావు మాట్లాడుతూ ఈ కార్యక్రమం నిర్వహణకు సహకరించిన మిత్రులందరికీ తన శుభాకాంక్షలు అభినందనలు తెలిపారు ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేసేందుకు మీలాంటి వారి సహాయ సహకారాలు నాకు సదా అవసరం అని ఆయన ఈ సందర్భంగా వారిని కోరారు. కార్యక్రమానికి ద్రోణం రాజు శ్రీరామ్ వ్యాఖ్యానం అందించగా కార్యక్రమంలో గాన మిత్ర అవార్డు గ్రహీత పత్తి సౌభాగ్య లక్ష్మి, ప్రముఖ న్యాయవాది తురగా నాగేశ్వరరావు, బావాన్స్ కాలేజీ హెచ్ఓడి పీవీ సత్యనారాయణ సంతోషనగర్ దేవాలయ ప్రధాన అర్చకులు నల్ల తీగ కృష్ణమాచార్యులు సౌమిత్రి కిరీటి కన్వీనర్ కరస్పాండెంట్ డాక్టర్ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. అనంతరం వివిధ రంగాలలో నిష్ణాతులైన 20 మందికి ఐరావతం అవార్డ్స్ అందజేసి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ప్రముఖ గాయని సిద్దిపేట వాసి సాహితీ ఆలపించిన బ్రమరాంబికాష్టకం విశేషంగా ఆకట్టుకుంది. ఇంకా ఈ కార్యక్రమంలో భాగంగా కళారత్న కృష్ణయ్య తన నటన చాతుర్యంతో అద్భుతంగా నటించి అందరూ మెచ్చుకునేలా రకరకాల నవ్వులతో నవ్వించి తన నటన చాతుర్యాన్ని నిరూపించి ఐరావతం అవార్డు దక్కించుకున్నారు అందుకు అనేకమంది ఆయనకు అభినందనలు తెలిపారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్