కొన్ని సందర్భాల్లో ఎలాంటి వారెంట్ లేకుండా, ఇంటి యజమాని అనుమతి లేకుండా పోలీసులు ఇంటిని సెర్చ్ చేస్తుంటారు. ఆ అధికారం పోలీసులకు ఉందా? చట్టం ఏం చెప్తోంది? అంటే.. మీ అనుమతి లేకున్నా, కోర్టు అనుమతితో మీ ఇంటిని సోదా చేసే అవకాశం పోలీసులకు ఉంటుందని చట్టం వివరిస్తోంది.
కొన్ని సందర్భాల్లో ఎలాంటి వారెంట్ లేకుండా, ఇంటి యజమాని అనుమతి లేకుండా పోలీసులు ఇంటిని సెర్చ్ చేస్తుంటారు. ఆ అధికారం పోలీసులకు ఉందా? చట్టం ఏం చెప్తోంది? అంటే.. మీ అనుమతి లేకున్నా, కోర్టు అనుమతితో మీ ఇంటిని సోదా చేసే అవకాశం పోలీసులకు ఉంటుందని చట్టం వివరిస్తోంది. అయితే, అందుకు కోర్టు పర్మిషన్ ఉండాలి. పోలీసులు ఇంటికి వచ్చినప్పుడు సెర్చ్ వారంట్ ఉందా? అని అడగాలి. అడిగితే పోలీసులు వారెంట్ చూపించి, ఇల్లు సోదా చేయొచ్చు. ఆధారాలు సేకరించడం, నేరస్థులను పట్టి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లడం, కస్టడీ వద్దకు తీసుకెళ్లడం, జడ్జి ముందు ప్రవేశపెట్డడం పోలీసుల విధి. కాబట్టి ఇల్లును సోదా చేసే హక్కు పోలీసులకు ఉంటుంది. ఒక వేళ ఇంటి యజమాని స్వచ్ఛందంగా సోదాకు ఒప్పుకుంటే ఎలాంటి వారెంట్ అవసరం లేకుండానే పోలీసులు ఆ ఇంటిని తనిఖీ చేయొచ్చు.
కింది సందర్భాల్లో సోదాలు ఇలా..
- దొంగిలించిన ఆస్తి, నకిలీ పత్రాలు ఉన్నట్టు అనుమానిస్తే
- ప్రభుత్వం నిషేధించిన ఏదైనా ప్రచురణను స్వాధీనం చేసుకోవడానికి
- ఎవరైనా వ్యక్తిని కిడ్నాప్ చేసి, దాచిపెడితే
సెర్చ్‌లో భాగంగా పోలీసులు ఇంటిలో ఏవైనా వస్తువులు కనుగొంటే.. వస్తువుల జాబితాను ఒక పేపర్‌పై రాసి, సాక్షుల సంతకం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ జాబితాను పంచనామా అంటారు. వస్తువుల జాబితా కాపీ.. ఇంటి యజమానికి అందించాలి.