అనుమానితులు, నిందితులను అరెస్టు చేశాక వారిని కొట్టే అధికారం పోలీసులకు ఉంటుందా? వారికి ఉండే పరిమితులు ఏంటి? భారత చట్టాలు ఏం చెప్తున్నాయి? అంటే.. అరెస్టు చేశాక పోలీసులకు ప్రజలను కొట్టే అధికారం లేదు.
అనుమానితులు, నిందితులను అరెస్టు చేశాక వారిని కొట్టే అధికారం పోలీసులకు ఉంటుందా? వారికి ఉండే పరిమితులు ఏంటి? భారత చట్టాలు ఏం చెప్తున్నాయి? అంటే.. అరెస్టు చేశాక పోలీసులకు ప్రజలను కొట్టే అధికారం లేదు. ఒకవేళ మిమ్మల్ని పోలీసులు కొడితే పోలీస్ యాక్ట్ 1861 సెక్షన్ 29 ప్రకారం.. ఆ పోలీస్ అధికారికి 3 నెలల జైలు శిక్ష లేదా జరిమానా లేదా జరిమానాతో పాటు శిక్ష వేయొచ్చు. భారత చట్టాల ప్రకారం.. ఒక వ్యక్తిని అరెస్టు చేసిన తర్వాత ఆ వ్యక్తి పూర్తి బాధ్యత ఆ పోలీస్ అధికారిదే. అందుకే అరెస్టు చేసే సమయంలోనే మెమో ఆఫ్ అరెస్ట్ రాయించాలి.
CRPC SECTION 41 B, C, D ప్రకారం.. పోలీస్ అధికారి మెమో ఆఫ్ అరెస్ట్ కచ్చితంగా రాయాలి. ఎలా అంటే.. ‘నేను ఫలానా పోలీస్ అధికారిని. ఫలానా వ్యక్తిని ఫలానా నేరం కింద అరెస్టు చేస్తున్నా’ అని అధికారి పేరు, అతని హోదా, తేదీ, స్థలం, ఏ స్టేషన్ పరిధిలో అరెస్టు చేస్తున్నారు, ఆ సమయంలో అరెస్టు అయ్యే వ్యక్తి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? స్వల్ప-తీవ్ర గాయాలున్నాయా? అతడి వద్ద ఉన్న వస్తువులు ఏంటి? అన్న వివరాలతో పేపర్‌పై రాయాలి. ఆ పేపర్‌పై అతడి బంధువులు లేదా శ్రేయోభిలాషులు, సమాజంలో మంచిపేరున్న వ్యక్తి సంతకం, అరెస్టు చేసే పోలీస్ సంతకం, అరెస్ట్ అయిన వ్యక్తి సంతకం కూడా కచ్చితంగా పేపర్‌పై ఉండాలి. దీన్నే మెమో ఆఫ్ అరెస్ట్ అంటారు.
అరెస్ట్ చేసిన వ్యక్తిని కచ్చితంగా 24 గంటల్లోగా మేజిస్ట్రేట్ లేదా కోర్టులో ప్రవేశపెట్టాలి. ఏ పోలీస్ అధికారైనా మిమ్మల్ని స్టేషన్‌కు రమ్మని ఫోన్ చేసి అడిగితే.. ‘Crpc సెక్షన్ 169, 170, 50 ప్రకారం నోటీసులు సర్వ్ చేయాలని వినయంగా కోరుతున్నా’ అని చెప్పండి. లేదా వారు ఫోన్ చేసిన మొబైల్ నంబర్‌కు మెసేజ్ చెయ్యండి. ఒకవేళ పోలీసులు ఆ నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకొన్న సందర్భాలు అనేకం. పలు సందర్భాల్లో పోలీసులు సస్పెన్షన్‌కు గురైన సంఘటనలు కూడా ఉన్నాయి.