CRPF Jobs | 9,212 పోస్టులకు విడుదల కానున్న నోటిఫికేషన్

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||ప్రతీకాత్మక చిత్రం||


సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. మొత్తం 9,212 పోస్టులు భర్తీకి మార్చి 24 న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. పురుషులకు 9,105, మహిళలకు 107 పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జూలై 1 నుంచి 13 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నారు. అర్హత, వయోపరిమితి, పరీక్ష పీజు, మొదలైనవి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. 

మొత్తం పోస్టులు: 9,212

పురుషుల పోస్టులు : 9,105

స్త్రీల పోస్టులు : 107 

పోస్టుల వివరాలు :  

డ్రైవర్: 2372, మోటార్ మెకానిక్: 544, కాబ్లెర్ (చెప్పులు కుట్టేవాళ్లు): 151, వడ్రంగి: 139, దర్జీ: 242, బ్రాస్ బ్యాండ్: 172, పైప్ బ్యాండ్: 51, బగ్లర్: 1340, గార్డనర్: 92, చిత్రకారుడు: 56, కుక్: 2475, బార్బర్: 303, హెయిర్ డ్రస్సర్: 1, వాషర్‌మ్యాన్: 406, సఫాయి కరంచారి: 824, ప్లంబర్: 1, తాపీ మేసన్: 6, ఎలక్ట్రీషియన్: 4

దరఖాస్తు ప్రారంభ తేదీ : మార్చి 24

దరఖాస్తు చివరి తేదీ : ఏప్రిల్ 24

అడ్మిట్ కార్డు : జూన్ 20 నుంచి జూన్ 25 వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. 

పరీక్ష పీజు  : రూ.100.

పరీక్ష తేదీ : 

జూలై 1 నుంచి జూలై 13 వరకు 

ఎంపిక విధానం : రాత పరీక్షతో పాటు నియామక ప్రక్రియలో ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉన్నాయి.

అధికారిక వెబ్‌సైట్  : crpf.gov.in


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్