Lakhpati Didi Yojana Online Apply : మహిళలకు గుడ్‌న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. దేశంలోని మహిళలకు కేంద్ర ప్రభుత్వం వ్యాపారం కోసం రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాన్ని అందిస్తోంది. మహిళలకు సొంతంగా వ్యాపారం చేసేందుకు ఆర్థిక చేయూతను అందిస్తోంది.
ప్రతీకాత్మక చిత్రం
Lakhpati Didi Yojana Online Apply : మహిళలకు గుడ్‌న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. దేశంలోని మహిళలకు కేంద్ర ప్రభుత్వం వ్యాపారం కోసం రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాన్ని అందిస్తోంది. మహిళలకు సొంతంగా వ్యాపారం చేసేందుకు ఆర్థిక చేయూతను అందిస్తోంది. ఈ స్కీమ్ పేరు లఖ్‌పతి దీదీ యోజన. మహిళలు సమాజంలో గొప్పగా ఎదగటం కోసం, మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించేందుకు వివిధ రకాల పథకాలను కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలోనే మహిళలను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసేందుకు లఖ్‌పతి దీదీ యోజన స్కీం అమలు చేస్తోంది.
ఈ పథకం ద్వారా ప్రభుత్వం మహిళలకు రూ.5 లక్షల వరకు వడ్డీ లేకుండా రుణాలు ఇస్తుంది. అయితే ఈ పథకాన్ని మహిళలు ఎలా వినియోగించుకోవాలి? ఎలా వారి వ్యాపారాన్ని మొదలు చేసుకోవాలనే విషయాలు తెలుసుకుందాం.. ఈ పథకం లక్ష్యం మహిళలను ఆర్థికంగా నిలదోక్కుకునేలా చేయడం, వ్యాపారాలను ప్రారంభించేందుకు చేయూతను అందించడమే. ఈ పథకం ప్రయోజనాలను పొందేందుకు మహిళలు మహిళ సంఘాల గ్రూపులలో చేరి ఉండాలి. ఇవి ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే మహిళల కోసం రూపొందించారు. ఈ బృందంలోని ఒక మహిళ సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే, ఆమె తన వ్యాపార ప్రణాళికతో మహిళ సంఘం బృందం ద్వారా రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ప్రక్రియ:
లఖ్‌పతి దీదీ స్కీమ్‌కి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అయితే.. ఈ పథకానికి దరఖాస్తు చేయాలనుకుంటే, మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://www.india.gov.in/spotlight/lakhpati-didi ను క్లిక్ చేసి, వెబ్‌సైట్ హోం పేజీలోకి వెళ్లి, ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయాలి. అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత అప్లికేషన్‌లో అవసరమైన మొత్తం సమాచారాన్ని నింపాలి. అన్ని పత్రాలను స్కాన్ చేసి అప్‌లోడ్ చేసి, సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి. అనంతరం రసీదు లభిస్తుంది. ఆ రసీదును ప్రింట్ తీసుకుని ఉంచుకోవాలి. ఈ విధంగా లఖ్‌పతి దీదీ యోజన కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆయా బృందంలోని మహిళా సభ్యుల వ్యాపార ప్రణాళికను మహిళ సంఘాల ద్వారా ప్రభుత్వానికి పంపించాలి. ప్రభుత్వ అధికారులు వారి దరఖాస్తును పరిశీలించిన తర్వాత దరఖాస్తు ఆమోదం పొందితే రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణం అందిస్తారు. దీంతో పాటు లోన్ పొందిన తర్వాత అవసరమైన శిక్షణను కూడా ప్రభుత్వం అందిస్తుంది. ఆయా కంపెనీ కోసం అవసరమైన నైపుణ్యాలను మెరుగుపర్చుకునే అవకాశం కల్పిస్తుంది. ఒక వేళ వారి బృందంలోని సభ్యులు ఇదివరకే లోన్ తీసుకుని ఉంటే మాత్రం మళ్లీ కొత్తగా లోన్ వచ్చే చాన్స్ తక్కువగా ఉంటుంది. పాత లోన్ గడువులోగా తీర్చడం, లేదా వాయిదాలు క్రమంగా కట్టడం ద్వారా వారికి మరిన్ని లోన్ సౌకర్యాలు లభిస్తాయి.
దరఖాస్తు చేసుకోవడానికి అర్హతలు:
1. లఖ్‌పతి దీదీ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటే, భారత పౌరులై ఉండాలి.
2. 18-50 సంవత్సరాల వయస్సు గల మహిళలు మాత్రమే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
3. మహిళా సంఘం గ్రూప్‌లో ఉన్న మహిళలు మాత్రమే ఈ పథకానికి అర్హులు
4. మహిళల వార్షిక ఆదాయం రూ.3 లక్షలకు మించకూడదు.
5. మహిళల కుటుంబంలో ఎవరికీ ప్రభుత్వ ఉద్యోగం ఉండకూదు.
లఖ్‌పతి దీదీ యోజనకు కావాల్సిన ధ్రువపత్రాలు:
1. ఆధార్ కార్డు
2. మొబైల్ నంబర్
3. పాస్‌పోర్టు సైజు ఫోటో
4. పాన్‌కార్డ్
5. ఆదాయ ధ్రువీకరణ పత్రం
6. చిరునామా
7. విద్య అర్హత సర్టిఫికేట్
8. బ్యాంకు ఖాతా వివరాలు