ప్రపంచ దేశాలను భయాందోళనకు గురి చేస్తున్న మంకీ ఫాక్స్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దద్దుర్లు ఉన్న రోగులను గుర్తించి వారికి వైద్యం అందించడానికి వార్డులు సిద్ధం చేయాలని అధికారులకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఢిల్లీలో మూడు నోడల్ ఆసుపత్రులను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. విమానాశ్రయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే అనుమానితులకు పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేసింది.
మంకీ ఫాక్స్
ప్రపంచ దేశాలను భయాందోళనకు గురి చేస్తున్న మంకీ ఫాక్స్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దద్దుర్లు ఉన్న రోగులను గుర్తించి వారికి వైద్యం అందించడానికి వార్డులు సిద్ధం చేయాలని అధికారులకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఢిల్లీలో మూడు నోడల్ ఆసుపత్రులను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. విమానాశ్రయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే అనుమానితులకు పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేసింది. ఆఫ్రికాలో ఈ ఏడాది 18 వేలకుపైగా మంకీ పాక్స్ కేసులు నమోదయ్యాయి. పొరుగు దేశం పాకిస్థాన్ లో మంకీ ఫాక్స్ కేసులు వెలుగు చూస్తున్నాయి. మంచి ఫాక్స్ కేసుల మరణాలు రేటు ఒకటి నుంచి పది శాతం వరకు ఉంది. ఈ నేపథ్యంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరికల మేరకు కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై రాష్ట్రాలకు ఆదేశాలను జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైన నేపథ్యంలో మంకీ ఫాక్స్ కు సంబంధించిన కొన్ని కీలక అంశాలు మీకోసం.
మంకీ ఫాక్స్ ఎలా వ్యాపిస్తుందంటే
మంకీ ఫాక్స్ మనుషులను తాకినప్పుడు, వారితో అతి దగ్గరగా నిలబడి మాట్లాడినప్పుడు ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ సోకిన జంతువులను దగ్గరకు తీసుకున్నప్పుడు కూడా వ్యాప్తి చెందుతుంది.
ముఖ్యమైన లక్షణాలు ఇవే
ఈ వైరస్ బారిన పడిన వారిలో తలనొప్పి, జ్వరం, గ్రందులు వాచిపోవడం, ఒళ్ళు నొప్పులు, శరీరంపై పొక్కులు కనిపిస్తాయి. శరీరంపై పొక్కులు రెండు నుంచి నాలుగు వారాల వరకు ఉంటాయి. మంకీ ఫాక్స్ వైరస్ కణాలు లోపలికి ప్రవేశిస్తాయి.
రక్షించుకోవడం ఎలా
మంకీ ఫాక్స్ వైరస్ బారిన పడిన వారిని రక్షించుకునేందుకు అనేక మార్గాలు ఉన్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. వైరస్ సోకిన వ్యక్తులను దూరంగా ఉంచాలి. తరచూ చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. లక్షణాలు కనిపించడం వెంటనే వైద్యుని సంప్రదించాలి. మాంసాన్ని తినే ముందు బాగా ఉడికించాలి. జంతువులను ముట్టుకునే సమయంలో గ్లౌవ్స్ ధరించాలి.
ఈ వైరస్ కు వ్యాక్సిన్ ఉందా
ఎంవీఏ - బిఎన్ అనే వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ వైరస్ ఆఫ్రికా దేశాల్లో ఎక్కువగా ఉంది. ఇతర దేశాలకు కూడా సోకే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల అన్ని దేశాలను హెచ్చరించింది. ఈ వైరస్ ను ముందే గుర్తించి మందులు వేసుకుంటే మంచిది. లేకపోతే కొన్ని కేసుల్లో మరణం కూడా సంభవించే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.