||ప్రతీకాత్మక చిత్రం||
దేశంలో కార్ల అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. గత సంవత్సరంలో అన్ని కంపెనీలు 37.93 లక్షల కార్లను విక్రయించాయి. అంతకుముందు సంవత్సరాలతో పోల్చితే 2022లో 23 శాతం ఎక్కువ కార్లు విక్రయించినట్టు మారుతి, స్కోడా, హ్యు్ండయ్, టయోటా కిర్లోస్కర్, టాటా, హోండా ఆటో బ్రాండ్స్ వెల్లడించాయి. 2018లో 33.5 లక్షల కార్లు అమ్ముడుపోగా, ఇప్పుడు 14 శాతం ఎక్కువ అమ్మకాలు జరిగాయి. టాటా మోటార్స్ 5.52 లక్షల కార్లను అమ్మకాలు విక్రయించగా నెలకు 14,000 యూనిట్లు విక్రయించింది. మారుతి 2022లో 15.76 లక్షల యునిట్లను విక్రయించింది. హ్యుండయ్ వెన్యూ గత సంవత్సరం 1.12 లక్షల కార్లను విక్రయించగలిగింది. అంటే కంపెనీ ప్రతి నెల కనీసం 10,000 యూనిట్లను అమ్మకాలు జరిపింది.
మహీంద్రా గత నెలలో మొత్తం 56,677 వాహనాలను విక్రయించగలుగుతోంది. గత ఏడాది జనవరి నుంచి నవంబర్ వరకు 1,30,690 యూనిట్లను విక్రయించింది. స్కోడా 53,721 లక్షల కార్లు విక్రయించింది. టొయోటా కిర్లోస్కర్ 1,60 లక్షల కార్లు విక్రయించింది. మొత్తంగా అన్ని కంపెల కార్లు కలిపి రోజుకు 10 వేల కార్లు అమ్ముడయ్యాయి.