Law Tip | పోలీసులకు మీ ఫోన్ చెక్ చేసే అధికారం ఉందా..?

రోడ్డుపై వెళ్తున్నప్పుడు పోలీసులు మిమ్మల్ని ఆపి మీ ఫోన్ చెక్ చేసే అధికారం ఉందా? ఫోన్‌లో ఆధారాలు ఉన్నాయని మీ ఫోన్‌ను స్వాధీనం చేసుకొనే హక్కును రాజ్యాంగం కల్పించిందా? చట్టం ఏం చెప్తోంది?

law tips
ప్రతీకాత్మక చిత్రం

రోడ్డుపై వెళ్తున్నప్పుడు పోలీసులు మిమ్మల్ని ఆపి మీ ఫోన్ చెక్ చేసే అధికారం ఉందా? ఫోన్‌లో ఆధారాలు ఉన్నాయని మీ ఫోన్‌ను స్వాధీనం చేసుకొనే హక్కును రాజ్యాంగం కల్పించిందా? చట్టం ఏం చెప్తోంది? పోలీసులకు రాజ్యాంగం విధించిన పరిమితులు ఏంటి? అంటే.. మీ ఫోన్ చెక్ చేసే ఎలాంటి అధికారం పోలీసులకు లేదు. పోలీసులు ఏదైనా కేసు టేకప్ చేసినప్పుడు ఆధారాలు సేకరించటం వారి పని. అయితే, ఆధారాలు సేకరించే సమయంలో ఏ ఆధారాలైతే మిమ్మల్ని దోషిగా నిరూపిస్తాయో, ఆ ఆధారాలు పోలీసులకు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్లు అడగకూడదు కూడా. ఎందుకంటే.. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 20 (3).. స్వీయ నేరారోపణను చెప్తోంది. దీని ప్రకారం.. మీరు మీరుగా దోషిగా నిరూపించుకొనే ఏ ఆధారాలు ఎవ్వరికీ ఇవ్వాల్సిన అవసరం లేదు. అది పోలీసుల పని. మీ పని కాదు. ఒకవేళ ఆధారాలు ఇచ్చినా అవి కోర్టులో చెల్లవు. వేరే ఆధారాలు అడిగితే మాత్రం మీరు ఇవ్వొచ్చు.

మీ ఫోన్ చెక్ చేయాలంటే పోలీసులు ఏం చేయాలంటే..

పోలీసులు ఏదైనా ఎలక్ట్రానిక్ పరికరాన్ని తెరవాలన్నా, పరిశీలించాలన్నా, స్వాధీనం చేసుకోవాలన్నా జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ నుంచి ముందుగా అనుమతి తీసుకోవాలి. అలాగే మీ ఫోన్, ఎలక్ట్రానిక్ పరికరం పాస్‌వర్డ్‌ను బహిర్గతం చేయాలని బలవంతం చేసే అధికారం వారికి లేదు. ఇదే విషయాన్ని ఢిల్లీ కోర్టు చాలా సార్లు స్పష్టం చేసింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 20(3)తో పాటు సీఆర్పీసీ సెక్షన్ 161 (2) ద్వారా నిందితుడికి రక్షణ ఉన్నందున పాస్‌వర్డ్ చెప్పాలని బలవంతం చేయకూడదు. ఒకవేళ దర్యాప్తు బృందం శోధిస్తుంటే.. అర్హత ఉన్న ఫోరెన్సిక్ ఎగ్జామినర్ ఉన్నప్పుడే శోధించాలి. ఆ దర్యాప్తు అధికారి ఆ పరికరాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు. సాక్ష్యం కోసం వెతక్కూడదు. ఫోరెన్సిక్ ఎగ్జామినర్ అందుబాటులో లేకపోతే ఆ పరికారాన్ని ప్యాక్ చేసి ఉంచాలి. లేకపోతే పరికరాన్ని యజమానికి అందించాలి.


వెబ్ స్టోరీస్