బెంగళూరులోని ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL).. తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ప్రతీకాత్మక చిత్రం
ఈవార్తలు, బెంగళూరు : బెంగళూరులోని ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL).. తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బీఈ, బీటెక్ అర్హతతో పాటు పని అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తామని బెల్ వెల్లడించింది. ఆ పోస్టుల ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి..
ప్రాజెక్ట్ ఇంజనీర్-1 (ఎలక్ట్రానిక్స్ 08)
అర్హత : బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయెపరిమితి: 01/09/2024 నాటికి 32 ఏళ్లు మించకూడదు.
ఓబీసీలకు మూడేళ్లు సడలింపు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు సడలింపు, దివ్యాంగులకు పది ఏళ్ల సడలింపు
జీతం: మెదటి ఏడాది రూ.40,000 (నెలకు)
రెండో ఏడాది రూ.45,000 (నెలకు)
మూడో ఏడాది 50,000 (నెలకు)
నాలుగో ఏడాది 55,000 (నెలకు)
పని ప్రదేశాలు: విశాఖపట్నం, ముంబై
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ అప్లికేషన్
దరఖాస్తు చివరి తేది: 09/10/2024
