ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని బీడీ కార్మికులు, మైనింగ్ వర్కర్ల పిల్లలు కేంద్ర కార్మిక శాఖ నేషనల్ స్కాలర్ షిప్స్ కోసం scholarships.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
ప్రతీకాత్మక చిత్రం
ఈవార్తలు : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని బీడీ కార్మికులు, మైనింగ్ వర్కర్ల పిల్లలు కేంద్ర కార్మిక శాఖ నేషనల్ స్కాలర్ షిప్స్ కోసం scholarships.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న 1-10 విద్యార్థులకు ప్రీ మెట్రిక్, 11వ తరగతి నుంచి డిగ్రీ వరకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్స్ వస్తాయని వెల్లడించారు. ప్రీ మెట్రిక్ కోసం ఆగస్టు 31 వరకు, పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ కోసం అక్టోబర్ 31 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. హెల్ప్ లైన్ నంబర్ 0120-6619540, 040-29561297 నంబర్లకు కాల్ చేయొచ్చని వివరించారు.
దరఖాస్తు విధానం ఇలా..
- బ్రౌజర్‌లో scholarships.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
- అందులో స్టూడెంట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- అప్లై ఫర్ స్కాలర్ షిప్ దగ్గర లాగిన్‌పై క్లిక్ చేయాలి.
- కొత్త యూజర్ అయితే, రిజిస్టర్ అయ్యి లాగిన్ చేయాలి.
- రిజిస్ట్రేషన్ కోసం మార్గదర్శకాలు పూర్తిగా చదివాలి. మొబైల్ నంబర్, ఈకేవైసీ వంటివి చేయాలి.
- రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక ఎన్ఎస్‌పీ ఓటీఆర్ యాప్‌ను మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసి ఆధార్ ఫేస్ ఐడీ నమోదుచేయాలి.
- అనంతరం ఓటీఆర్ జనరేట్ అవుతుంది.
- ఆ ఓటీఆర్‌తో లాగిన్ అయ్యాక పూర్తి వివరాలు నమోదు చేయాలి.
జాగ్రత్తలు:
- వివరాలు నమోదు చేశాక మళ్లీ ఎడిటింగ్ ఆప్షన్ లేనందున జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి.
- తప్పుడు సమాచారం ఇస్తే దరఖాస్తు తిరస్కరణకు గురికావచ్చు
- ఓటీఆర్ నంబర్‌ను గుర్తుంచుకోవాలి. తర్వాత దరఖాస్తు ప్రాసెస్‌ను తెలుసుకోవడానికి వీలవుతుంది.
- ఒక విద్యార్థికి ఒక ఓటీఆర్ మాత్రమే ఉంటుంది. ఎక్కువగా ఉన్నట్లు గుర్తిస్తే స్కాలర్‌షిప్‌ను డిబార్ చేసే ప్రమాదం ఉంది.