అవార్డులు బాధ్యతలను పెంచుతాయి: విశ్రాంత ట్రాఫిక్ డీసీపీ సుంకర సత్యనారాయణ

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||Image 1||

(రంగారెడ్డి, ఈవార్తలు ప్రతినిధి, అక్కినేపల్లి పురుషోత్తమరావు)
అవార్డులు అనేవి బాధ్యతను పెంచుతాయని భవిష్యత్తును గుర్తుచేస్తాయని విశ్రాంతి డిసిపి సుంకర సత్యనారాయణ అన్నారు. త్యాగరాయ గానసభ కళా సుబ్బారావు కళావేదికపై సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏకతా పురస్కారాలు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఎక్స్లెన్సీ అవార్డులు అందజేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ అవార్డులు అనేవి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాలను వారి యొక్క బాధ్యతలను పెంచుతూ భవిష్యత్తును గుర్తుచేస్తాయని అన్నారు. ఈ సందర్భంగా పలువురికి సర్దార్ వల్లభాయి పటేల్ ఏకత పురస్కారం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఎక్స్లెన్సీ అవార్డులు అందజేశారు. కార్యక్రమానికి గెస్ట్ ఆఫ్ ఆనర్ అవార్డు పొందిన చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ సీతయ్య మాట్లాడుతూ ఎంతో పని ఒత్తిడి ఉన్న శిఖరం వారి ఆహ్వానం మేరకు ఇక్కడకు రావడం జరిగిందని అన్నారు ఇంకా కార్యక్రమంలో శిఖరం ఆర్ట్స్ థియేటర్ ఫౌండర్ కార్యదర్శి గొల్ల కృష్ణ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా మెట్రో టీవీ ఛానల్ చీపు ఎడిటర్ కొండవీటి జయప్రసాద్ హాజరయ్యారు.

ప్రతాప్ వంశీకృష్ణకి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏకతా పురస్కారం

ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ సిటీ ఈసీ మెంబర్ గ్లోబల్ హ్యూమన్ రైట్స్ స్టేట్ సెక్రటరీ ప్రతాప్ వంశీకృష్ణ కి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏకతా పురస్కారం అందజేశారు. పురస్కారం అందజేసిన వారిలో చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ ఏ సీతయ్య ప్రముఖ కూచిపూడి నర్తకి కూచిపూడి గురువు ఎస్పీ భారతి సుంకర సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ ఈ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని మరింతగా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తానని అన్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్