ఈనెల 10 నుంచి 15వ తేదీ వరకు అగ్ని వీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరుగుతుందని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. డీఎస్సీ స్టేడియం మెయిన్ గేటు వద్ద కుడివైపున ఉన్న ట్యాంకు సమీపంలోని చిన్న మైదానం వద్ద రిజిస్ట్రేషన్ లను నిర్వహించేందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. అనంతరం అభ్యర్థులందరూ ఆర్మీ అధికారుల సూచనల ప్రకారం ఆయా దశల్లో ర్యాలీలో పాల్గొనాల్సి ఉంటుంది.
ఇండియన్ ఆర్మీ ర్యాలీ
దేశ సైన్యంలో చేరి సేవలు అందించాలని నిరుద్యోగ యువతకు శుభవార్తను అందించింది ఇండియన్ ఆర్మీ. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన అగ్ని వీర్ లో వివిధ విభాగాల్లో పనిచేసేందుకు అవసరమైన సిబ్బందిని భర్తీ చేసేందుకు ఆర్మీ ర్యాలీని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే దేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ తరహా ర్యాలీలు నిర్వహిస్తూ భారీ ఎత్తున నియామక ప్రక్రియను చేపడుతున్నారు. ఆదివారం నుంచి కడపలోని డీఎస్సీ స్టేడియంలో ఈ నియామక ర్యాలీ జరగనుంది. ఈనెల 10 నుంచి 15వ తేదీ వరకు అగ్ని వీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరుగుతుందని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. డీఎస్సీ స్టేడియం మెయిన్ గేటు వద్ద కుడివైపున ఉన్న ట్యాంకు సమీపంలోని చిన్న మైదానం వద్ద రిజిస్ట్రేషన్ లను నిర్వహించేందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. అనంతరం అభ్యర్థులందరూ ఆర్మీ అధికారుల సూచనల ప్రకారం ఆయా దశల్లో ర్యాలీలో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ ఆర్మీ ర్యాలీలో అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఇండోర్ స్టేడియంలో మెడికల్ టెస్ట్లు నిర్వహించనున్నారు. స్క్రీనింగ్ సమయంలో అభ్యర్థులకు ఏమైనా గాయాలు తగిలితే అక్కడే ఉన్న వైద్య శిబిరాలు వైద్య సేవలు అందించేలా ఏర్పాటు చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థులకు ఇక్కడ గుడారాల్లో వసతి కల్పించారు. భోజన వసతి కూడా ఏర్పాటు చేశారు.
ఈ ర్యాలీలో రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాలకు చెందిన అభ్యర్థులు పాల్గొనే అవకాశాన్ని అధికారులు కల్పించారు. వివిధ కేటగిరీలకు సంబంధించిన పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఇది గొప్ప అవకాశంగా చెబుతున్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని వారిని అధికారులు కోరారు. ర్యాలీలో పాల్గొనే అభ్యర్థులకు ఇప్పటికే అడ్మిట్ కార్డులను అధికారులు అందించారు. వీటిని తీసుకుని అభ్యర్థులు రావాల్సి ఉంటుంది. అదే సమయంలో అభ్యర్థులు తప్పనిసరిగా అందుకు అవసరమైన ద్రువ పత్రాలను తీసుకొని ర్యాలీకి రావాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు.