చాలామందికి పోలీస్ స్టేషన్ అన్నా, కోర్టు అన్నా భయం. జీవితంలో వీలైనంత వరకు ఈ రెండింటి జోలికి పోవొద్దని కోరుకుంటారు. అయితే, మనకు తెలియకుండానే కొన్ని పరిస్థితులు మనల్ని పోలీస్ స్టేషన్ వైపు, కోర్టు వైపు నడిపిస్తుంటాయి. అయితే, పోలీస్ స్టేషన్లు, కోర్టులు సినిమాల్లో చూపించినట్లు ఉండవు అన్న విషయాన్ని కచ్చితంగా గుర్తుంచుకోవాలి.
ఈవార్తలు, న్యాయ వార్తలు: చాలామందికి పోలీస్ స్టేషన్ అన్నా, కోర్టు అన్నా భయం. జీవితంలో వీలైనంత వరకు ఈ రెండింటి జోలికి పోవొద్దని కోరుకుంటారు. అయితే, మనకు తెలియకుండానే కొన్ని పరిస్థితులు మనల్ని పోలీస్ స్టేషన్ వైపు, కోర్టు వైపు నడిపిస్తుంటాయి. అయితే, పోలీస్ స్టేషన్లు, కోర్టులు సినిమాల్లో చూపించినట్లు ఉండవు అన్న విషయాన్ని కచ్చితంగా గుర్తుంచుకోవాలి. సినిమాల్లో మాదిరి ఏం మాట్లాడినా, ఏం చేసినా చెల్లుతుందిలే అనుకుంటే మూర్ఖత్వమే అవుతుంది. సినిమాల్లో చూపించినట్లు, నిజజీవితంలో కోర్టులు, పోలీస్ స్టేషన్లకు చాలా తేడా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మరి.. తొలిసారి కోర్టుకు వెళితే ఎలా ఉండాలి? ఎలాంటి దుస్తులు ధరించాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అన్నది తెలుసుకుంటే మంచిది.
- కేసుకు సంబంధించి న్యాయమూర్తి కేటాయించిన సమయానికి కోర్టులో ఉండాలి.
- వీలైనంత వరకు పిల్లలను కోర్టుకు తీసుకువెళ్లకూడదు.
- మోడ్రన్ దుస్తులు ధరించకూడదు. గుట్కాలు, సిగరెట్ వంటికి కోర్టుకు తీసుకెళ్లరాదు.
- ఫోన్‌ను సైలెంట్ మోడ్‌లో పెట్టుకోవాలి.
- కోర్టులో అతిగా మాట్లాడవద్దు. న్యాయమూర్తి మాట్లాడటానికి కొంత సమయం ఇస్తారు. ఆ సమయంలోనే మాట్లాడాలి.
- తరువాతి వాయిదా తేదీని తెలుసుకోవాలి.
- మీ లాయర్‌కు పదేపదే కాల్ చేసి విసిరించకూడదు. మీ లాయర్ బిజీగా ఉంటే, మెసేజ్ చేస్తే మంచిది.
- కోర్టులో ఉన్నంతసేపు మీ భావోద్వేగాలను నియంత్రణలో ఉంచుకోవాలి.