మనకు వచ్చే చాలా కలలు భవిష్యత్తులో జరిగే పరిణామాలను సూచిస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఐతే కొన్ని కలలు మాత్రం ఎవరితోనూ చెప్పకూడదట. మీకు వచ్చే కలలు కొన్ని మంచివి ఉంటే మరికొన్ని చెడు సంకేతాలుగా వుంటాయని అని పండితుల అభిప్రాయం. అసలు నిద్రలో వచ్చే కలలు ఎలాంటి సూచనలు తెలియజేస్తాయో తెలుసుకుందాం..
ప్రతీకాత్మక చిత్రం
మనకు వచ్చే చాలా కలలు భవిష్యత్తులో జరిగే పరిణామాలను సూచిస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఐతే కొన్ని కలలు మాత్రం ఎవరితోనూ చెప్పకూడదట. మీకు వచ్చే కలలు కొన్ని మంచివి ఉంటే మరికొన్ని చెడు సంకేతాలుగా వుంటాయని అని పండితుల అభిప్రాయం. అసలు నిద్రలో వచ్చే కలలు ఎలాంటి సూచనలు తెలియజేస్తాయో తెలుసుకుందాం..
వాస్తు శాస్రం ప్రకారం తెల్లవారుజామున వచ్చే కలలు నిజం అవుతాయట. ఏదైనా ఒక కల సూర్యోదయం తర్వాత వస్తే సుమారు 15 రోజుల్లో అది నిజమవుతుంది. కలల గ్రంథం ప్రకారం ఎవరైనా చనిపోయినట్టు మీకు కల వస్తే మాత్రం దాన్ని ఎవరితోనూ చెప్పకూడదు. ఇలాంటి కలలు మీకు వస్తే త్వరలోనే మీ జీవితంలో ఉన్న అన్ని కష్టాలు తొలిగిపోతాయని అర్థం. మీ కలలో మీ మరణం కనిపిస్తే అది శుభప్రదమట. మీరు త్వరలో అదృష్టాన్ని పొందబోతున్నారని అర్థం. ఇక మరణానికి సంబంధించి కొన్ని అరిష్ట కలలు కూడా ఉంటాయి. కలలో ఆత్మహత్యను చూస్తే అది చాలా అరిష్టం. ఇలాంటి కల వస్తే మాత్రం మీరు ఏదైనా ఇబ్బందుల్లో పడుతున్నారని సంకేతం.
బంగారు నగలు కలలో కనిపిస్తే అది చాలా అదృష్టం. ఇలాంటి కల కూడా ఎవరితోనూ చెప్పకూడదు. బంగారాన్ని మీరు కలలో చూస్తే త్వరలోనే మీ సంపద పెరగబోతుందని అర్థం చేసుకోవాలి. కలలో దెయ్యం కనిపించడం కూడా భవిష్యత్తులో పెద్ద సమస్యను సూచిస్తుంది. మీకు పీడ కలలు మరీ ఎక్కువగా వస్తుంటే నిద్ర పోయే ముందు మీ దిండు కింద రెండు లవంగాలను పెట్టుకొని పడుకోండి. ఈ చిన్న పరిహరం పాటించడం వల్ల పీడ కలల సమస్య నుంచి బయటపడవచ్చు. మీ కలలో పాములు కాటు వేసి రక్తం వచ్చినట్టు కనిపిస్తే మీ కష్టాలన్నీ తీరి అదృష్టం పట్టపోతుందని అర్థం చేసుకోవాలి. అలానే పామును మీరు చంపినట్టు కల వస్తే మాత్రం కష్టాలు ఎదురవుతాయి.
మీ కలలో మీ భార్య కనిపిస్తే చాలా శుభప్రదం. ఇలాంటి కలలు వైవాహిక జీవితంలో ఆనందాన్ని సూచిస్తాయి. ఎవరికైనా కలలో తమ భార్య మరణించినట్టు కనిపించినట్లయితే చాలా శుభం జరుగుతుందని అర్థం చేసుకోవాలి. భార్య చనిపోయినట్లు కల వస్తే శుభమేంటి అని అనుకుంటున్నారా? ఇలాంటి కలల వల్ల మీ భార్య వయసు పెరుగుతుందని అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా మీ భార్య ఆరోగ్యం బాగుంటుందని అర్థం. భర్త చనిపోయినట్టు కల వచ్చిన ఇదే అర్థం. భార్యతో సన్నిహితంగా, శృంగారంలో ఉన్నట్లు కలవస్తే మీ ఇద్దరి మధ్య ప్రేమ బంధం పెరుగుతున్నట్లు అర్థం చేసుకోవాలి.
మాంసం తింటున్నట్లు కల వస్తే మీకు త్వరలో గాయాలు అవుతాయని తెలుసుకోవాలి. కాబట్టి తగిన జాగ్రతలు తీసుకోవడం మంచిది. మీ కలలో కుక్కలు కరిచినట్లు కలలు వస్తే త్వరలో మీకు కష్టాలు ప్రారంభమవుతాయట. ఒక్కోసారి మన కలలో మనల్ని ఎవరో కొట్టినట్టు అనిపిస్తుంది,అలా దెబ్బలు తింటున్నట్లు కలలు వస్తే పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారట. మీకు పెళ్లి అయినట్లు కల వస్తే మీ జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయట. కలలో కుంకుమ పెట్టుకున్నట్లు కనిపిస్తే మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుందట. పరిచయం లేని స్త్రీ వెళ్తున్నట్టు కల వస్తే మీ వైవాహిక జీవితంలో సమస్యలు రాబోతున్నాయని అని అర్థం. ఉదయం 3 గంటల మధ్య సమయం ఎంతో శక్తివంతమైనంది. దీన్నే మన శాస్త్రాలలో బ్రహ్మ ముహుర్తం అని అంటారు. ఉదయం 3 గంటల నుండి 5 గంటల సమయంలో ఎన్నో అద్భుత శక్తులు ఉంటాయి. ఈ సమయంలో దేవతలు తిరుగుతూ ఉంటారు. కాబట్టి తెల్లవారుజామున బ్రహ్మ ముహుర్తంలో మీకు మెళకువ వస్తే మాత్రం చాలా అదృష్టం.
