APPSC | ఏపీపీఎస్సీ గ్రూప్-1 తుది ఫలితాలు విడుదల

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||ప్రతీకాత్మక చిత్రం||

ఈవార్తలు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) గ్రూప్‌-1 (Group-1) తుది ఫలితాలు విడుదల అయ్యాయి. గురువారం సాయంత్రం ఏపీపీఎస్సీ చైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్ ఈ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్వ్యూల అనంతరం ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితాను వెల్లడించారు. మొత్తం 111 గ్రూప్‌-1 పోస్టులకు గాను 259 మందిని ఇంటర్వ్యూలకు ఎంపిక చేసినట్టు తెలిపారు. వీరిలో 39 మందిని స్పోర్ట్స్‌ కోటాలో ఎంపిక చేశామని వివరించారు. ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 2వ తేదీ నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించామని, మొత్తం 16 విభాగాల్లో 110 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. స్పోర్ట్స్ కోటాలో ఒక పోస్టు నియామకంపై త్వరలో ప్రకటిస్తామని గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. గ్రూప్‌-1లో తొలి 3 ర్యాంకులు మహిళా అభ్యర్థులవే కావటం గమనార్హం. 

గ్రూప్-1 టాప్‌ 5 ర్యాంకర్లు

ఫస్ట్ ర్యాంక్ - భానుశ్రీ లక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూష

సెకండ్ ర్యాంక్ - భూమిరెడ్డి భవాని

థర్డ్ ర్యాంక్ - కంబలకుంట లక్ష్మీప్రసన్న

ఫోర్త్ ర్యాంక్ - ప్రవీణ్‌ కుమార్‌రెడ్డి 

ఫిఫ్త్ ర్యాంక్ - భానుప్రకాశ్‌రెడ్డి


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్