ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది. అక్టోబర్ 3వ తేదీ నుంచి అక్టోబర్ 20వ తేదీ వరకు నిర్వహిస్తామని ప్రకటించింది.
ప్రతీకాత్మక చిత్రం
అమరావతి, ఈవార్తలు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది. గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఆగస్టు 5 నుంచి ఆగస్టు 20 వరకు పరీక్షలు జగాల్సి ఉండగా, ఆ పరీక్షలను అక్టోబర్ 3వ తేదీ నుంచి అక్టోబర్ 20వ తేదీ వరకు నిర్వహిస్తామని తాజాగా ప్రకటించింది. ఈ మేరకు మార్పులు చేసిన షెడ్యూల్‌ను వెల్లడించింది. పరీక్షకు సన్నద్ధమయ్యేందుకు సమయం కావాలని అభ్యర్థులు కోరటంతో సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం.. సోమవారం కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పరీక్ష ఫలితాలను నవంబర్ 2వ తేదీన విడుదల చేయనుంది. రాష్ట్రంలో మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి ఏపీ సీఎం చంద్రబాబు సంతకం చేసిన సంగతి తెలిసిందే. ఆ పరీక్షను దృష్టిలో పెట్టుకొని తాజాగా టెట్ రాసే అభ్యర్థులకు అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. డీఎస్సీలో టెట్‌కు 20 శాతం వెయిటేజీ ఉంటుంది.
కొత్త షెడ్యూల్ వివరాలు ఇవే..
నోటిఫికేషన్ విడుదలైన తేదీ : జూలై 2
పరీక్ష ఫీజు గడువు : ఆగస్టు 3
ఆన్‌లైన్ మాక్ టెస్ట్ : సెప్టెంబర్ 19 నుంచి
టెట్ ఎగ్జామ్ : అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు
ప్రైమరీ కీ : అక్టోబర్ 3
అభ్యంతరాల స్వీకరణ : అక్టోబర్ 4 నుంచి
ఫైనల్ కీ : అక్టోబర్ 27
రిజల్ట్స్ : నవంబర్ 2