ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్ (AOC) గ్రూప్ C (ట్రేడ్స్‌మ్యాన్ మేట్, ఫైర్‌మ్యాన్ & ఇతర) ఖాళీల భర్తీకి దరఖాస్తును ఆహ్వానిస్తోంది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు మరియు అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్ (AOC) గ్రూప్ C రిక్రూట్‌మెంట్‌లో మొత్తం 723 ఖాళీలలను విడుదల చేసింది.
ప్రతీకాత్మక చిత్రం
ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్ (AOC) గ్రూప్ C (ట్రేడ్స్‌మ్యాన్ మేట్, ఫైర్‌మ్యాన్ & ఇతర) ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. మొత్తం 723 పోస్టులకుగానూ వివిధ పోస్టులు ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్‌లో తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్ (AOC):
ఖాళీ వివరాలు: గ్రూప్ సి
మెటీరియల్ అసిస్టెంట్ :(MA) 19 పోస్టులు
జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ : (JOA) 27 పోస్టులు
సివిల్ మోటార్ డ్రైవర్ : (OG) 04 పోస్టులు
టెలి ఆపరేటర్ గ్రేడ్-II : 14 పోస్టులు
ఫైర్‌మెన్ : 247 పోస్టులు
కార్పెంటర్ & జాయినర్ : 07 పోస్టులు
పెయింటర్ & డెకరేటర్ : 05 పోస్టులు
ట్రేడ్స్‌మ్యాన్ మేట్ : 389 పోస్టులు
ఎంటీఎస్ : 11 పోస్టులు
