రెడ్ మీ నుంచి మార్కెట్లోకి మరో స్మార్ట్ వాచ్.. అదిరిపోయే ఫీచర్లు దీని సొంతం

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్ తయారీ సంస్థ రెడ్ మీ మార్కెట్లోకి మరో స్మార్ట్ వాచ్ ను విడుదల చేస్తోంది. ఈ కంపెనీ వినియోగదారులకు ఆకర్షణీయమైన ధరలతో ప్రీమియం ఫీచర్లను అందిస్తూ స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్ లను మార్కెట్లోకి తీసుకువస్తుంది. తాజాగా అత్యాధునిక ఫీచర్లతో కూడిన స్మార్ట్ వాచ్ ను మార్కెట్ లోకి ఈ సంస్థ తీసుకువచ్చింది. గడిచిన ఏడాది Redmi watch 5 active, watch 5 lite లాంచ్ చేసిన తర్వాత ఇప్పుడు కంపెనీ మరో స్మార్ట్ వాచ్ అయిన Redmi watch move ను ఏప్రిల్ 21న భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. యువర్ నెక్స్ట్ బిగ్ మూవ్ అనే టాగ్ లైన్ తో రెడ్ మీ ఈ స్మార్ట్ వాచ్ ను ప్రమోట్ చేస్తోంది.

Redmi Smart Watch Move

రెడ్ మీ స్మార్ట్ వాచ్

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్ తయారీ సంస్థ రెడ్ మీ మార్కెట్లోకి మరో స్మార్ట్ వాచ్ ను విడుదల చేస్తోంది. ఈ కంపెనీ వినియోగదారులకు ఆకర్షణీయమైన ధరలతో ప్రీమియం ఫీచర్లను అందిస్తూ స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్ లను మార్కెట్లోకి తీసుకువస్తుంది. తాజాగా అత్యాధునిక ఫీచర్లతో కూడిన స్మార్ట్ వాచ్ ను మార్కెట్ లోకి ఈ సంస్థ తీసుకువచ్చింది. గడిచిన ఏడాది Redmi watch 5 active, watch 5 lite లాంచ్ చేసిన తర్వాత ఇప్పుడు కంపెనీ మరో స్మార్ట్ వాచ్ అయిన Redmi watch move ను ఏప్రిల్ 21న భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. యువర్ నెక్స్ట్ బిగ్ మూవ్ అనే టాగ్ లైన్ తో రెడ్ మీ ఈ స్మార్ట్ వాచ్ ను ప్రమోట్ చేస్తోంది. ఇది మీ ఫిట్నెస్ ప్రయాణాన్ని మెరుగుపరిచేందుకు, లైఫ్ స్టైల్స్ కు అనుగుణంగా డిజైన్ చేసిన ఫీచర్ రిచ్ వాచ్ గా ఉండబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. తాజాగా మార్కెట్లోకి తీసుకువచ్చిన ఈ స్మార్ట్ వాచ్ లో AMOLED డిస్ప్లే ఉండబోతుందన్న విషయం కంపెనీ ఇప్పటికే ధ్రువీకరించింది.

దీనికి సంబంధించి విడుదల చేసిన టీజర్ ప్రకారం ఈ వాచ్ కు కర్వ్డ్ స్క్రీన్, కుడివైపులో సింగిల్ బట్టన్ ఉండేలా డిజైన్ చేసినట్లు కనిపిస్తోంది. రాబోయే స్మార్ట్ వాచ్ లోని ప్రధాన ఫీచర్లు విషయానికి వస్తే.. ఇందులో 2.07 అంగుళాల AMOLED డిస్ ప్లే, 1500 నిట్స్ బ్రైట్ నెస్ తో ఉండబోతోంది. ఇందులో 5 సిస్టమ్ GNSS ఇంటిగ్రేషన్, అల్యూమినియం అలాయ్ ప్రీమియం ఫ్రేమ్, బ్లూటూత్ ఫోన్ కాల్ సపోర్ట్, డ్యూయల్ మైక్ నైస్ రిడక్షన్, లీనియర్ మోటార్, ఒకే ఛార్జ్ తో 24 రోజుల బ్యాటరీ లైఫ్ ఉండనుంది. ఇది స్మార్ట్ వాచ్ లో భిన్నమైన ఫీచర్లను కోరుకునే వారికి ఎంతగానో ఆకట్టుకుంటుందని చెబుతున్నారు. ఇప్పటికే టీజర్ విడుదల కావడంతో ఈ వాచ్ కు సంబంధించిన ఫుల్ స్పెసిఫికేషన్లు, ధర, అదనపు ఫీచర్లు అతి త్వరలోనే తెలియనున్నాయి. ఏప్రిల్ 21న అధికారికంగా విడుదల అయ్యే ఈ వాచ్ గురించి పూర్తి సమాచారం త్వరలో అందుబాటులోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ భిన్నమైన ఫీచర్లను తెలుగు ఉండడంతో వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ స్మార్ట్ వాచ్ ఒకసారి ధరిస్తే స్మార్ట్ లుక్ అదరగొడుతుందని ఆ సంస్థ పేర్కొంటుంది. మార్కెట్లోకి వచ్చే కొత్త గాడ్జెట్ ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది కాస్త ఆకర్షణీయంగానే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఈ స్మార్ట్ వాచ్ డిజైన్, ఫీచర్లు, v లైఫ్ స్టైల్ ఫోకస్ తో భారతీయ వినియోగదారులకు ఒక విలువైన ఎంపికగా నిలిచే అవకాశం ఉందని ఆ సంస్థ వెల్లడించింది. ఫిట్నెస్ గాడ్జెట్ లలో ఆసక్తి ఉన్నవారికి ఇది ఇంట్రెస్ట్ గా మారుతుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్