||ప్రతీకాత్మక చిత్రం||
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలిసెట్ ప్రవేశ పరీక్ష కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు శుభవార్త. 2023 డిప్లొమా కోర్సుల కోసం ప్రవేశానికి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర సాంకేతిక విద్య కమిషనర్, శిక్షణ మండలి ఛైర్‌పర్సన్ నాగరాణి గురువారం తెలిపారు. నోటిఫికేషన్ కి సంబంధించిన వివరాలు అధికారిక వెబ్‌సైట్ https://polycetap.nic.inని సందర్శించవచ్చు. పదవ తరగతి పాసైన వారు ఇప్పుడు చదువుతున్న వారు పాలిసెట్ కి అప్లై చేసుకోవచ్చు. ఈరోజునుండి ఏప్రిల్ 30వ తేదీ వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. దీనికి సంబంధించిన ప్రవేశ పరీక్ష మే 10వ తేదీ ఉదయం 11 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు నిర్వహించనున్నారు. అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు ఓసి, బీసీ రూ. 400 ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది.