సన్న వడ్లకు అదనంగా బోనస్‌ ప్రకటన.. తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు

తెలంగాణ కేబినెట్‌ భేటీ శనివారం సాయంత్రం ముగిసింది. సీఎం రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర సచివాలయంలో శనివారం సాయంత్రం జరిగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ భేటీలో రైతులకు మేలు చేసే కీలక నిర్ణయాన్ని రేవంత్‌రెడ్డి సర్కారు తీసుకుంది. సన్న వడ్లకు రూ.500 బోనస్‌ అందించేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన కేబినెట్‌.. ఇప్పటి వరకు వేసిన కేబినెట్‌ సబ్‌ కమిటీలు, వాటి నివేదికలపై చర్చించింది.

CM Revanth Reddy in Cabinet meeting

కేబినెట్‌ భేటీలో సీఎం రేవంత్‌ రెడ్డి

తెలంగాణ కేబినెట్‌ భేటీ శనివారం సాయంత్రం ముగిసింది. సీఎం రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర సచివాలయంలో శనివారం సాయంత్రం జరిగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ భేటీలో రైతులకు మేలు చేసే కీలక నిర్ణయాన్ని రేవంత్‌రెడ్డి సర్కారు తీసుకుంది. సన్న వడ్లకు రూ.500 బోనస్‌ అందించేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన కేబినెట్‌.. ఇప్పటి వరకు వేసిన కేబినెట్‌ సబ్‌ కమిటీలు, వాటి నివేదికలపై చర్చించింది. ములుగు జిల్లాలోని సమ్మక్క సారలమ్మ సెంట్రల్‌ యూనివర్సిటీకి ఎకరానికి రూ.250 చొప్పున భూమిని కేటాయించాలని నిర్ణయించింది. మద్దూర్‌ మండల కేంద్రాన్ని మున్సిపాలిటీ అప్‌గ్రేడ్‌ చేయడానికి ఆమోదం తెలిపింది. హనుమకొండ, వరంగల్‌ జిల్లాల పరిధి పెంపుపైనా కీలక నిర్ణయాన్ని తీసుకుంది. రేరాలో 54 ఉద్యోగాలు భర్తీకి ఆమోదం తెలిపింది. ఈ మేరకు టీజీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది. ఏటూరు నాగారం రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటకు మంత్రివర్గం ఓకే చెప్పింది. ఉస్మానియా ఆస్పత్రి పునఃనిర్మాణానికి గోషామహల్‌ పోలీస్‌ గ్రౌండ్స్‌ భూమిని బదలాయిస్తూ నిర్ణయాన్ని తీసుకుంది. వీటితోపాటు మూసీ పునరుజ్జీవ చర్యలు, హైడ్రా, 317 జీవో, ఉద్యోగుల డీఏలు, ధాన్యం కొనుగోళ్లు, కొత్త రేషన్‌ కార్డులు జారీ తదితరఅంశాలపై కేబినెట్‌ భేటీలో చర్చించారు. కొన్ని ముఖ్యమైన అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 

వీటితోపాటు మరిన్ని అంశాలపైనా మంత్రులంతా కేబినెట్‌ సమావేశంలో చర్చించారు. మరిన్ని కీలక నిర్ణయాలను తీసుకున్నారు. రాష్ట్రంలో యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ ఏర్పాటు ప్రక్రియలో మరో ముందడుగు వేసేలా భేటీలో నిర్ణయాన్ని తీసుకున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నెలకొల్పుతున్న యూనివర్సిటీ భవన నిర్మాణానికి మేఘా ఇంజనీరింగ్‌ ఇన్‌ప్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ ముందుకు వచ్చింది. దీంతో క్యాంపస్‌ నిర్మాణానికి సంస్థ తమ సీఎస్‌ఆర్‌ నిధులు నుంచి రూ.200 కేటాయించినట్టు అధికారులు వెల్లడించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. హైదరాబాద్‌ నగరంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేకే కావాలనే కొందరు విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మూసీ నిర్వాసితులకు అద్భుతమైన జీవితాన్ని ఇవ్వాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. నిర్వాసితులకు ఉండే చోట అద్భుతమైన టవర్స్‌ నిర్మించి వారి పిల్లలకు ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌ నిర్మిస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో మంత్రులు శ్రీదర్‌ బాబు, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డితోపాటు ఇతర మంత్రులు పాల్గొన్నారు. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్