ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమా పథకం ఈకపై దేశంలో 70 ఏళ్ళు, ఆపైపడిన వయసు వారందరికీ వర్తించనుంది. ఆదాయంతో సంబంధం లేకుండా ఆ వయసు వారంతా అర్హులు కానున్నారు. ఈ మేరకు మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం అమలు నిర్ణయంతో దాదాపు 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ధి చేకూరనుంది. 70 ఏళ్లు పైబడిన వారంతా సామాజిక, ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా ఏడాదిలో ఐదు లక్షల వరకు ఉచిత వైద్య సౌకర్యం ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా పొందనున్నారు. ఇప్పటికే ఈ పథకం వర్తిస్తున్న కుటుంబాల్లోని 70 ఏళ్లు పైబడిన వారు ఉంటే వారికి అదనంగా ఏడాదికి ఐదు లక్షల బీమా సౌకర్యం వర్తించనుంది.
ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమా కార్డు
ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమా పథకం ఈకపై దేశంలో 70 ఏళ్ళు, ఆపైపడిన వయసు వారందరికీ వర్తించనుంది. ఆదాయంతో సంబంధం లేకుండా ఆ వయసు వారంతా అర్హులు కానున్నారు. ఈ మేరకు మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం అమలు నిర్ణయంతో దాదాపు 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ధి చేకూరనుంది. 70 ఏళ్లు పైబడిన వారంతా సామాజిక, ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా ఏడాదిలో ఐదు లక్షల వరకు ఉచిత వైద్య సౌకర్యం ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా పొందనున్నారు. ఇప్పటికే ఈ పథకం వర్తిస్తున్న కుటుంబాల్లోని 70 ఏళ్లు పైబడిన వారు ఉంటే వారికి అదనంగా ఏడాదికి ఐదు లక్షల బీమా సౌకర్యం వర్తించనుంది. ఇతర ప్రభుత్వ బీమా పథకాల్లో అంటే సిజిహెచ్ఎస్, ఈసిహెచ్ఎస్, సిఏపీఎఫ్ వంటి స్కీమ్స్ వర్తిస్తుంటే దాన్ని లేదా ఆయుష్మాన్ భారత్ ను ఎంచుకునే వెసులుబాటు లబ్ధిదారులకు ఉంటుంది. ప్రైవేటు ఆరోగ్య భీమా పాలసీలు ఉన్నా లేదా కార్మిక రాజ్య బీమా (ఈఎస్ఐ) పథకం వర్తిస్తున్న వారు ఆయుష్మాన్ భారత్ లో కూడా లబ్ధి పొందవచ్చు. ఈ పథకంలో అర్హులైన సీనియర్ సిటిజనులకు ప్రత్యేకంగా కొత్త కార్డు జారీ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఈ పథకంలో 12.34 కోట్ల కుటుంబాలకు చెందిన 55 కోట్ల మందికి ఆరోగ్య భీమా సౌకర్యం కల్పించింది. ఈ పథకంలో భాగంగా ఏడాదికి ఉచితంగా ఐదు లక్షల వరకు వైద్య సేవలు పొందవచ్చు. ఈ పథకంలో ప్రజలు ఇప్పటిదాకా లక్ష కోట్ల రూపాయల లబ్ధి పొందారని, లబ్ధిదారుల్లో 49 శాతం మంది మహిళలని కేంద్రం పేర్కొంది. ప్రపంచంలో ప్రభుత్వాలు అమలు చేసే ఆరోగ్య భీమా పథకాల్లో అతిపెద్దదుగా ఆయుష్మాన్ భారత్ కు పేరు ఉంది. ఈ పథకాన్ని 70 ఏళ్లు, ఆపై వైషు ఉన్న వారి కోసం విస్తరిస్తామని ప్రధాని మోదీ ఏప్రిల్ లో ప్రకటించారు. ఈ మేరకు తాజాగా కేబినెట్ ఈ నిర్ణయాన్ని తీసుకుని అమలు చేయడానికి సిద్ధమవుతోంది.
ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ కార్డులు పంపిణీ
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా హెల్త్ కార్డులను దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే లబ్ధిదారులకు పంపిణీ చేశారు. తొలి దశలో కొంతమందికి మాత్రమే ఈ కార్డులను కేంద్ర ప్రభుత్వం అందించింది. రానున్న రోజుల్లో మిగిలిన కేటగిరీలకు సంబంధించిన లబ్ధిదారులకు హెల్త్ కార్డులు అందించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు గతంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలోనే తాజాగా 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఈ పథకాన్ని వర్తించేలా నిర్ణయం తీసుకుంది. రానున్న రోజుల్లో నిరుపేద వర్గాలకు చెందిన మరిన్ని కేటగిరీల ప్రజలకు ఈ పథకాన్ని వర్ధింప చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని పేర్కొంటున్నారు. ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా హెల్త్ కార్డులు ఉన్న లబ్ధిదారులు దేశంలో ఎక్కడైనా ఆయుష్మాన్ భారత్ పథకం నెట్వర్క్ లో ఉన్న ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్య సేవలు పొందేందుకు అవకాశం ఉంటుంది. ఆరోగ్య శ్రీ పథకంలో భాగంగా రాష్ట్రంలోని ప్రజలు ఏపీతోపాటు తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ఆసుపత్రిల్లో ఉచితంగా వైద్య సేవలను పొందుతున్నారు. ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా మాత్రం దేశంలో ఎక్కడైనా ఉచితంగా వైద్య సేవలను పొందే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోంది.