Types of Cheque | చెక్కులు ఎన్ని రకాలు.. వాటితో ఉపయోగాలేంటంటే..

Cheque Types : బ్యాంకుల్లో చెక్కులు అన్ని రకాల అకౌంట్ హోల్డర్లకు అందజేస్తారు. బ్యాంకింగ్ రంగం వచ్చిన కొత్తలో చెక్ బుక్ ఉండటం హోదాగా భావించేవాళ్లు. ఆ తర్వాత అది కామన్ అయిపోయింది. ప్రస్తుతం యూపీఐ, డిజిటల్ లావాదేవీలు ఎక్కువ కావడంతో చెక్కుల అవసరం తగ్గిపోయింది. అయినా.. అధికారిక లావాదేవీలకు చెక్ బుక్కులే వాడుతున్నారు. అయితే, చెక్కుల్లో అనేక రకాలు ఉంటాయన్న సంగతి మీకు తెలుసా? అందరికీ ఒకే విధమైన చెక్ అందజేయరు. సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి చెక్కుల జారీ ఉంటుంది.

cheque types

Cheque Types : బ్యాంకుల్లో చెక్కులు అన్ని రకాల అకౌంట్ హోల్డర్లకు అందజేస్తారు. బ్యాంకింగ్ రంగం వచ్చిన కొత్తలో చెక్ బుక్ ఉండటం హోదాగా భావించేవాళ్లు. ఆ తర్వాత అది కామన్ అయిపోయింది. ప్రస్తుతం యూపీఐ, డిజిటల్ లావాదేవీలు ఎక్కువ కావడంతో చెక్కుల అవసరం తగ్గిపోయింది. అయినా.. అధికారిక లావాదేవీలకు చెక్ బుక్కులే వాడుతున్నారు. అయితే, చెక్కుల్లో అనేక రకాలు ఉంటాయన్న సంగతి మీకు తెలుసా? అందరికీ ఒకే విధమైన చెక్ అందజేయరు. సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి చెక్కుల జారీ ఉంటుంది.

open cheque
ఓపెన్ చెక్ (Open Check): ఓపెన్ చెక్‌ను Uncrossed Cheque అని కూడా అంటారు. క్రాస్ చేయని చెక్ ఓపెన్ చెక్ కేటగిరీ కిందకు వస్తుంది. ఈ చెక్‌ను బ్యాంక్‌లో అందజేస్తే దాన్ని సమర్పించిన వ్యక్తికి డబ్బు చెల్లిస్తారు.
self cheque
సెల్ఫ్ చెక్ (Self Check): ఒక వ్యక్తి తనకు తాను జారీ చేసుకునే చెక్ ఇది. పేరు దగ్గర Self అని రాస్తారు. ఒక వ్యక్తి, తన బ్యాంకు ఖాతా నుంచి డబ్బు తీసుకోవడానికి సెల్ఫ్ చెక్ రాసుకుంటాడు.
Stale cheque
స్టేల్ చెక్ (Stale Check): చెల్లుబాటు వ్యవధి ముగిస్తే ఈ చెక్ చెల్లుబాటు కాదు. ఒకప్పుడు.. ఈ వ్యవధి చెక్ జారీ చేసిన తేదీ నుంచి ఆరు నెలలు ఉండేది. ఇప్పుడు మూడు నెలలకు తగ్గించారు.
order cheque
ఆర్డర్ చెక్ (Order check): చెల్లింపుదారు పేరు తర్వాత Or to Order అని రాసి ఉన్న చెక్ ఇది. దీనిని పేయబుల్ టు ఆర్డర్ Payable to Order ​​చెక్ అని కూడా పిలుస్తారు.
crossed cheque
క్రాస్డ్ చెక్ (Crossed cheque): చెక్ జారీ చేసే వ్యక్తి A/C Payee అని రాసి, చెక్ పైమూల భాగంలో రెండు సమాంతర గీతలు గీస్తాడు. ఈ చెక్కును జారీ చేసిన వ్యక్తి బ్యాంక్లో, చెక్ మీద పేరు ఉన్న వ్యక్తి మాత్రమే కాకుండా ఎవరైనా సబ్మిట్ చేయవచ్చు. అయితే, చెక్కులో పేరు ఉన్న వ్యక్తి ఖాతాలో మాత్రమే డబ్బు జమ చేస్తారు. క్రాస్డ్ చెక్ వల్ల అనధికారిక వ్యక్తి చెక్‌ను వాడుకోలేడు.
account payee cheque
అకౌంట్ పేయి చెక్ (Account Payee Cheque): ఈ చెక్ ఉపయోగించి జారీ చేసిన ఖాతాదారుడి బ్యాంక్ ఖాతా నుండి డబ్బును చెల్లింపుదారుడి ఖాతాకు మాత్రమే బదిలీ చేయవచ్చు
bearer cheque
బేరర్ చెక్ (Bearer cheque): బేరర్ చెక్.. డబ్బు చెల్లించేందుకు దీన్ని ఉపయోగిస్తారు. దీన్ని మనం సర్వసాధారణంగా చూస్తుంటాం. చెక్కుపై పేరు ఉన్న వ్యక్తి నగదును మార్చుకునేందుకు వీలు కల్పిస్తుంది. దీన్ని పేయబుల్ టు బేరర్ Payable to Bearer అని కూడా అంటారు.
post dated cheque
పోస్ట్ డేటెడ్ చెక్ (Post dated cheque): జారీ చేసిన తేదీన కాకుండా, ఆ తర్వాతి కాలంలో క్యాష్‌గా మార్చుకునేందుకు జారీ చేసే చెక్కును పోస్ట్ డేటెడ్ చెక్ అని అంటారు. ఈ చెక్కును జారీచేసిన తర్వాత ఎప్పుడైనా బ్యాంకుకు సమర్పించవచ్చు. అయితే, చెక్కుపై పేర్కొన్న తేదీ లోపులో చెల్లింపుదారు ఖాతా నుంచి నిధులు బదిలీ జరగదు.
bankers cheque
బ్యాంకర్స్ చెక్ (Bankers cheque): ఖాతాదారుని తరపున మరో వ్యక్తికి నిర్దిష్ట మొత్తంలో డబ్బు చెల్లించాలనే బ్యాంక్ జారీ చేసే చెక్ ఇది. దీన్నే డిమాండ్ డ్రాఫ్ట్ Demand Draft అని కూడా అంటారు.
traveller cheque
ట్రావెలర్స్ చెక్ (Traveller's cheque): ఇది, ప్రపంచవ్యాప్తంగా ఆమోదం ఉన్న & కరెన్సీకి మారో రూపంగా గుర్తింపు ఉన్న చెక్. ఒక వ్యక్తి ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లినప్పుడు చెల్లింపులు చేయడానికి వీలుగా నేరుగా బ్యాంక్ జారీ చేసే చెక్. ట్రావెలర్స్ చెక్‌కు గడువు తేదీ అంటూ ఏదీ ఉండదు. మరోదేశం నుంచి తిరిగి వచ్చాక దాన్ని నగదు రూపంలోకి కూడా మార్చుకోవచ్చు.

సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్