ప్రతీకాత్మక చిత్రం

పెళ్లికి ముందే స్త్రీ, పురుషులు కలిసి ఉండటాన్ని లివ్ ఇన్ రిలేషన్‌షిప్ అంటారు.

వాస్తవానికి విదేశాల్లో లివ్ ఇన్ రిలేషన్‌షిప్స్ కామన్. ఈ మధ్య భారత్‌లోనూ ఇలాంటి సంబంధాలు పెరుగుతున్నాయి.

మరి అలా కలిసి ఉండవచ్చా? అది చట్టబద్ధంగా చెల్లుతుందా? అంటే చాలా మందికి దానిపై స్పష్టత లేదు.

సహజీవనానికి మన దేశ చట్టాలు గుర్తింపునివ్వలేదు. కానీ అవి నేరం కాదని సుప్రీం కోర్టు స్పష్టంచేసింది.

ఉత్తరాఖండ్‌లో యూనిఫాం సివిల్ కోడ్‌ అమలు చేయటంతో లివ్ ఇన్‌ రిలేషన్‌షిప్‌పై క్లారిటీ వచ్చింది.

ఉత్తరాఖండ్ యూనిఫాం సివిల్ కోడ్, సహజీవనానికి చట్టబద్ధత కల్పించడం ద్వారా ప్రజల వ్యక్తిగత హక్కులు కాపాడబడతాయి.

గతంలో సహజీవనంలో పుట్టిన పిల్లలను చట్టపరంగా వారసులుగా గుర్తించలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో పిల్లలకు కూడా తల్లిదండ్రుల ఆస్తిలో హక్కు లభిస్తుంది.

సహజీవనం చేస్తే తమ భాగస్వామి మరణం తర్వాత ఆస్తిలో వారసత్వ హక్కు పొందవచ్చు.

సహజీవనం చెల్లుబాటు కావాలంటే.. లివ్-ఇన్ రిలేషన్‌షిప్స్‌ను సుప్రీంకోర్టు మొదటిసారిగా 1978లో అధికారికంగా గుర్తించింది. సహజీవనం చెల్లుబాటు కావాలంటే ఇద్దరు వ్యక్తులు తప్పనిసరిగా కలిసి ఉండటానికి సమ్మతించాలి. వారికి చట్టబద్ధమైన పెండ్లి వయసు ఉండాలి.

సహజీవనంలో ఉన్న పురుషుడు తన భాగస్వామికి సరిపోని భరణం ఇవ్వకపోతే, అతడిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవచ్చు. 2005 వుమెన్ అండ్ డొమెస్టిక్ వయొలెన్స్ యాక్ట్ కింద మహిళలకు ఆర్థిక హక్కులు లభిస్తాయి.

evarthalu Web Stories