Yuvraj Singh Abhishek Sharma | ట్రెండింగ్‌లో యువరాజ్ అభిషేక్ శర్మ.. కారణం అదేనా..

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ వీరవిహారం చేశాడు. ప్రత్యర్థి బౌలర్ ఎవరు అన్నది కాకుండా.. ప్రతి బాల్‌ను ఊచకోత కోశాడు. 34 బంతుల్లోనే 79 పరుగులతో విధ్వంసకర బ్యాటింగ్‌ చేశాడు.

yuvraj abhishek sharma

యువీ, అభిషేక్ శర్మ

ఇండియాలో ప్రస్తుతం టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్ టీ20 సిరీస్ నడుస్తోంది. అందులో భాగంగా బుధవారం సాయంత్రం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ వీరవిహారం చేశాడు. ప్రత్యర్థి బౌలర్ ఎవరు అన్నది కాకుండా.. ప్రతి బాల్‌ను ఊచకోత కోశాడు. 34 బంతుల్లోనే 79 పరుగులతో విధ్వంసకర బ్యాటింగ్‌ చేశాడు. ఆకాశమే హద్దుగా చెలరేగాడు కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసకున్నాడు. హాఫ్ సెంచరీ పూర్తయ్యాక మరింత దూకుడుగా ఆడుతూ.. భారీ సిక్సర్లు కొట్టాడు. మొత్తంగా మ్యాచ్‌లో 8 సిక్సులు బాదాడు. అయితే, కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రెండో భారత బ్యాటర్‌గా అభిషేక్ శర్మ నిలిచాడు. అయితే, తొలి బ్యాటర్ ఎవరు అంటే.. యువరాజ్ సింగే. 2007 టీ20 వరల్డ్ కప్‌లో కేవలం 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు యువీ. అప్పుడు కూడా ప్రత్యర్థి ఇంగ్లండే.

ఆనాడు యువరాజ్ సింగ్, ఇప్పుడు అభిషేక్ శర్మ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీలు చేయడం గమనార్హం. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే.. యువరాజ్ శిక్షణలోనే అభిషేక్ శర్మ రాటుదేలాడు. అచ్చం యువరాజ్ కొట్టినట్టే, యువరాజ్ బ్యాటింగ్ శైలినే కలిగిన అభిషేక్ శర్మ.. గత ఐపీఎల్‌లోనూ దుమ్ముదులిపాడు. అయితే, ఇంగ్లండ్‌తో తొలి టీ20లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ బాదిన నేపథ్యంలో సోషల్ మీడియాలో అంతా యువీనే గుర్తు చేస్తున్నారు. దీంతో వీరిద్దరి పేర్లు ట్విట్టర్‌లో ట్రెండింగ్‌గా మారాయి.

ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన భారత బ్యాటర్లు వీరే..

1. యువరాజ్ - 2007 డర్బన్ - 12 బంతుల్లో 

2. అభిషేక్ శర్మ - 2025 కోల్‌కతా - 20 బంతుల్లో

3. కేఎల్ రాహుల్ - 2018 మాంచెస్టర్ - 27 బంతుల్లో


2026లో 27 సాధారణ సెలవులు
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్