వైభవ్ సూర్యవంశీ.. 12 ఏళ్ల రికార్డ్ బద్దలు!

టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సెంచరీ బాదిన అత్యంత పిన్నవయస్కుడిగా నిలిచాడు.

vaibhav suryavanshi

వైభవ్ సూర్యవంశీ

టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సెంచరీ బాదిన అత్యంత పిన్నవయస్కుడిగా నిలిచాడు. ఈ ప్రతిష్టాత్మక దేశవాళీ టీ20 టోర్నీలో బీహార్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న వైభవ్ సూర్యవంశీ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగాడు. ఈ టోర్నీలో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విఫలమైన సూర్యవంశీ.. నాలుగో మ్యాచ్‌లో 61 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్‌లతో 108 పరుగులు చేశాడు. ఈ సెంచరీతో సూర్యవంశీ 12 ఏళ్ల రికార్డ్‌ను బద్దలు కొట్టాడు. 2013లో మహారాష్ట్ర బ్యాటర్ విజయ్ జోల్ 18 ఏళ్ల 118 రోజుల వయసులో (109) సెంచరీ చేసి అతిపిన్నవయస్కుడిగా నిలిచాడు. ఇన్నాళ్లు చెక్కు చెదరకుండా ఉన్న ఈ రికార్డ్‌ను వైభవ్ సూర్యవంశీ బద్దలు కొట్టాడు. 14 ఏళ్ల 250 రోజుల వయసులో సూర్యవంశీ 108 పరుగులు చేసి ఈ ఫీట్ సాధించాడు. ఈ జాబితాలో వైభవ్ సూర్యవంశీ తర్వాత ఆయుష్ మాత్రే(18 ఏళ్ల 135 రోజులు), ఆయుష్ మాత్రే(18 ఏళ్ల 137 రోజులు), షేక్ రషీద్(19 ఏళ్ల 25 రోజులు) ఉన్నారు. భారత్ తరఫున టీ20ల్లో మూడు సెంచరీలు నమోదు చేసిన అత్యంత పిన్నవయస్కుడిగా కూడా వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. ఈ క్రమంలో తిలక్ వర్మ పేరిట ఉన్న రికార్డ్‌ను బద్దలు కొట్టాడు. వైభవ్ సూర్యవంశీ 14 ఏళ్ల 250 రోజుల వయసులో ఈ ఫీట్ అందుకుంటే తిలక్ వర్మ(22 ఏళ్ల 7 రోజుల వయసు), దేవదత్ పడిక్కల్(22 ఏళ్ల 96 రోజులు), యశస్వి జైస్వాల్(22 ఏళ్ల 126 రోజులు), అహ్మద్ షేహ్‌జాద్(22 ఏళ్ల 127 రోజులు), ఉన్ముక్త్ చంద్(22 ఏళ్ల, 295 రోజులు) తర్వాత ఉన్నారు.


విద్యార్థినిని గొంతు కోసి చంపిన యువకుడు
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్