స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో గాయపడిన శుభ్‌మన్ గిల్ గురించి కీలక అప్డేట్ వచ్చింది. మెడకు గాయంతో వన్డే సిరీస్‌కూ సైతం దూరమైన గిల్ పునరాగమనానికి సిద్ధమవుతున్నాడు.
శుభ్‌మన్ గిల్
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో గాయపడిన శుభ్‌మన్ గిల్ గురించి కీలక అప్డేట్ వచ్చింది. మెడకు గాయంతో వన్డే సిరీస్‌కూ సైతం దూరమైన గిల్ పునరాగమనానికి సిద్ధమవుతున్నాడు. వరుసగా సఫారీలతో రెండు సిరీస్‌లలో ఆడని భారత కెప్టెన్ తదుపరి టీ20 సిరీస్‌లోపు ఫిట్‌నెస్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నాడు. అందుకని.. భారత కెప్టెన్ బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో చేరనున్నాడు. డిసెంబర్ 9 నుంచి మొదలయ్యే పొట్టి సిరీస్‌కు అందుబాటులో ఉండే అవకాశముంది. బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ మాట్లాడుతూ గిల్ ఆరోగ్యంపై కీలక అప్డేట్ ఇచ్చాడు. భారత సారథి ఆరోగ్యం మెరుగైందని.. అతడు త్వరలోనే మైదానంలోకి దిగుతాడని మోర్కెల్ చెప్పాడు. అతడు అన్నట్టే.. గిల్ ఫిట్‌నెస్ నిరూపించుకునేందుకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో చేరాడు