టీ20లకూ గిల్ కెప్టెన్‌గా ఉండాలి: గంగూలీ

టీ20ల్లోనూ గిల్‌ను కెప్టెన్‌గా చేయాలని చాలా మంది బీసీసీఐకి సూచిస్తున్నారు. ఈ జాబితాలోకి తాజాగా భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చేరాడు. అన్ని ఫార్మాట్లలో గిల్‌ను కెప్టెన్‌గా నియమించాలని గంగూలీ అభిప్రాయపడ్డాడు.

Sourav Ganguly

సౌరవ్ గంగూలీ

టీ20ల్లోనూ గిల్‌ను కెప్టెన్‌గా చేయాలని చాలా మంది బీసీసీఐకి సూచిస్తున్నారు. ఈ జాబితాలోకి తాజాగా భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చేరాడు. అన్ని ఫార్మాట్లలో గిల్‌ను కెప్టెన్‌గా నియమించాలని గంగూలీ అభిప్రాయపడ్డాడు. ‘సౌతాఫ్రికాతో తొలి టెస్టు సందర్భంగా ఈడెన్ గార్డెన్స్‌లో ఒకరితో నాకు ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. శుభ్‌మన్ గిల్ టీ20ల్లో కూడా కెప్టెన్‌గా ఉండాలని మీరు కోరుకుంటున్నారా? ఒకరు నన్ను అడిగారు. వెంటనే నేను అవునాని సమాధానమిచ్చాను. అతడికి అద్భుతమైన కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయి. శుభ్‌మన్ ఏ ఫార్మాట్‌లో నైనా జట్టును నడిపించగలడు అని చెప్పా. మూడు నెలల క్రితం అతడు ఇంగ్లండ్‌లో ఏమి చేశాడో మనమందరం చూశాం. బ్యాటింగ్, కెప్టెన్సీతో అదరగొట్టాడు. రోహిత్ శర్మ, కోహ్లి వంటి సీనియర్లు లేనప్పటికి అతడు తన కెప్టెన్సీతో అద్భుతం చేశాడు’ అని దాదా పేర్కొన్నాడు.


ధనాధన్.. దంచేద్దాం... దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు టీమిండియా సంసిద్ధం...
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్