కేకేఆర్ అసిస్టెంట్ కోచ్‌గా షేన్ వాట్సన్

కేకేఆర్ అసిస్టెంట్ కోచ్‌గా షేన్ వాట్సన్

shane-watson

షేన్ వాట్సన్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌కు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ తమ కోచింగ్ బృందంలో ఓ కీలక మార్పు చేసింది. ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్‌ను జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా నియమించినట్లు ప్రకటించింది. షేన్ వాట్సన్ ఇటీవల ప్రధాన కోచ్‌గా నియమితులైన భారత మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్‌తో కలిసి పని చేస్తాడు. షేన్ వాట్సన్ ఆస్ట్రేలియా తరఫున 59 టెస్టులు, 190 వన్డేలు, 58 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించాడు తన నియామకంపై షేన్ వాట్సన్ సంతోషం వ్యక్తం చేశాడు. ‘కోల్‌కతాకు మరో టైటిల్ తీసుకురావడానికి కోచింగ్ బృందం, ఆటగాళ్లతో కలిసి పని చేయడానికి నేను ఆసక్తిగా ఉన్నాను’ అని పేర్కొన్నారు. షేన్ వాట్సన్ గతంలో రాజస్థాన్, చెన్నై తరఫున ఆడాడు. 2008లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు తొలి ఐపీఎల్ టైటిల్‌ను అందించడంలో కీలక పాత్ర పోషించారు. ఆ సీజన్‌లో, అలాగే 2013లో కూడా మోస్ట్ వాల్యూవబల్ ప్లేయర్ అవార్డును గెలుచుకున్నారు.


ఇక గూగుల్ రోడ్డు.. టీసీఎస్ వీధి!
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్