రోకో టీమిండియాకు వెన్నెముక: అఫ్రిది

భారత క్రికెట్ జట్టు సీనియర్ స్టార్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ప్రశంసల వర్షం కురిపించాడు. వీరిద్దరినీ జట్టు నుంచి తప్పించాలనే వాదనలను అఫ్రిది కొట్టిపారేశాడు.

 shahid afridi

షాహిద్ అఫ్రిది

భారత క్రికెట్ జట్టు సీనియర్ స్టార్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ప్రశంసల వర్షం కురిపించాడు. వీరిద్దరినీ జట్టు నుంచి తప్పించాలనే వాదనలను అఫ్రిది కొట్టిపారేశాడు. విరాట్, రోహిత్ భారత జట్టుకు వెన్నెముక వంటి వారని, 2027 ప్రపంచకప్ వరకు వాద్దరినీ కొనసాగించాలని అభిప్రాయపడ్డాడు. ‘విరాట్, రోహిత్ భారత బ్యాటింగ్ లైనప్‌కు మూలస్తంభాలు అన్నది వాస్తవం. ఇటీవలి వన్డే సిరీస్‌లలో వారి ప్రదర్శన చూశాక, వారు 2027 ప్రపంచకప్ వరకు ఆడగలరని నమ్మకంగా చెప్పవచ్చు’ అని అఫ్రిది పేర్కొన్నాడు. కీలక సిరీస్‌ల కోసం ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లను కాపాడుకోవాలని, బలహీన జట్లతో ఆడేటప్పుడు వారికి విశ్రాంతినిచ్చి కొత్త ఆటగాళ్లను పరీక్షించాలని సూచించాడు. ఈ సందర్భంగా భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై అఫ్రిది విమర్శలు గుప్పించాడు. ‘గంభీర్ తన కోచింగ్ బాధ్యతలు స్వీకరించినప్పుడు, తాను చెప్పిందే సరైందని, తాను అనుకున్నదే జరగాలని భావించినట్లు అనిపించింది. కానీ, ఎప్పుడూ మనం చెప్పిందే సరైంది కాదని కొంతకాలానికే నిరూపితమైంది’ అని వ్యాఖ్యానించాడు. వన్డేల్లో అత్యధిక సిక్సర్ల రికార్డును రోహిత్ శర్మ అధిగమించడంపై అఫ్రిది సంతోషం వ్యక్తం చేశాడు. ‘రికార్డులు అనేవి బద్దలు కొట్టడానికే ఉంటాయి. నాకు ఎంతో ఇష్టమైన ఆటగాడు నా రికార్డును బ్రేక్ చేయడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.


Daily Horoscope | ఈ రోజు రాశి ఫలాలు 9 డిసెంబర్ 2025
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్