రో-కో భిన్నం: బంగర్

భారత స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని ఇతర ఆటగాళ్ల కంటే భిన్నంగా చూడాల్సిన అవసరం ఉందని భారత మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ అభిప్రాయపడ్డాడు.

sanjay bangar

సంజయ్ బంగర్

భారత స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని ఇతర ఆటగాళ్ల కంటే భిన్నంగా చూడాల్సిన అవసరం ఉందని భారత మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ అభిప్రాయపడ్డాడు. టెస్టులు, టీ20లకు వీడ్కోలు పలికిన రో-కో ప్రస్తుతం వన్డేలు మాత్రమే ఆడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో రోహిత్, కోహ్లీ అదరగొట్టారు. ఈ జోడీ 2027 ప్రపంచ కప్ వరకు కెరీర్‌ కొనసాగించాలని కోరుకుంటోంది. అయితే, వీరిని దేశవాళీ క్రికెట్‌లో ఆడాలని బీసీసీఐ కోరినట్లు సమాచారం. అందుకు ఈ ద్వయం సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ‘జట్టులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల స్థానాన్ని ఎన్నడూ ప్రశ్నించకూడదు. ఎన్నో ఏళ్లుగా వారు జట్టు కోసం ఏం చేశారో చూడండి. వారిద్దరూ రెండు ఫార్మాట్ల నుంచి రిటైర్ అయ్యారు. కానీ, ఫామ్‌ విషయంలో వారికి పెద్దగా ఇబ్బంది ఉండదు. వారికి ఆట కొత్త కాదు. కొన్ని ఓవర్లు ఆడితే లయ అందుకుంటారు. యువ ప్లేయర్లలా వీళ్లు ఎక్కువ మ్యాచ్‌లు ఆడాల్సిన అవసరం లేదు. పరుగులు చేయాలనే తపన ఉండి ఫిట్‌గా ఉన్న నాణ్యమైన ఆటగాళ్లు మనకు అవసరం. ఈ విషయంలో రో-కోకు ఢోకా లేదు. వారిని ఇతర క్రికెటర్ల కన్నా భిన్నంగా చూడాలి. వారి ఉనికి డ్రెస్సింగ్ రూమ్ వాతావరణాన్ని మారుస్తుంది’ అని సంజయ్ బంగర్ అన్నాడు.


టీమిండియాకు 10 శాతం జరిమానా
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్